AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhoni: వాయమ్మో.! ధోనికి ప్రతీ నెలా బీసీసీఐ ఇంత పెన్షన్ ఇస్తోందా.? ఎంతో తెలిస్తే

ఇండియన్ క్రికెట్ చరిత్రలో తనదైన ముద్ర వేసిన వ్యక్తి మహేంద్రసింగ్ ధోని. ఫార్మాట్ ఏదైనా సరే భారత జట్టును విజయవంతంగా నడిపించిన ధోని అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా గుర్తింపు పొందాడు. ధోని క్రికెట్ లో సాధించిన రికార్డులు, అవార్డులు, విజయాలు అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చెప్పొచ్చు.

Dhoni: వాయమ్మో.! ధోనికి ప్రతీ నెలా బీసీసీఐ ఇంత పెన్షన్ ఇస్తోందా.? ఎంతో తెలిస్తే
Ms Dhoni
Ravi Kiran
|

Updated on: Mar 19, 2025 | 7:37 PM

Share

ఇండియన్ క్రికెట్ చరిత్రలో తనదైన ముద్ర వేసిన వ్యక్తి మహేంద్రసింగ్ ధోని. ఫార్మాట్ ఏదైనా సరే భారత జట్టును విజయవంతంగా నడిపించిన ధోని అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా గుర్తింపు పొందాడు. ధోని క్రికెట్ లో సాధించిన రికార్డులు, అవార్డులు, విజయాలు అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చెప్పొచ్చు. ఇకపోతే బిసిసిఐ మాజీ క్రికెటర్స్ కు వారి సేవలను గుర్తించి పెన్షన్ అందిస్తోంది. ఆటగాడు ఆడిన మ్యాచ్‌లు, భారత జట్టుకు చేసిన సేవలను బట్టి పెన్షన్ మొత్తాన్ని నిర్ణయిస్తారట.

ఆటగాళ్లకు ఆర్థిక భద్రత కల్పించడమే ఈ పథకానికి ముఖ్య ఉద్దేశ్యం. ముఖ్యంగా టీం ఇండియాకు ఆడిన మ్యాచ్ ల ఆధారంగా పెన్షన్ మొత్తాన్ని నిర్ణయిస్తారు. ఇందులో భాగంగా 75 కంటే ఎక్కువ టెస్ట్ లు ఆడిన లేదా 50 కంటే ఎక్కువ టెస్ట్ లు ఆడి ఉండి టీం ఇండియా అద్భుత విజయాల్లో తోడ్పడిన క్రికెటర్లకు 70 వేల రూపాయల పెన్షన్ అందిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ తీసుకున్న ఆటగాళ్లకు బిసిసిఐ 2022లో ఈ పెన్షన్ పథకాన్ని మరింత మెరుగుపరచింది.

అప్పటి బిసిసిఐ ఉపాధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తీసుకున్న నిర్ణయాలతో ఆటగాళ్లకు పెన్షన్ మొత్తం పెరిగింది. పురుషులతో పాటు మహిళా క్రికెటర్స్ కి ఈ పథకం వర్తిస్తుంది. ధోని తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ లో 90 టెస్ట్ లు, 350 వన్డేలు, 98 టి20లు ఆడాడు. ఈ నేపథ్యంలో అతనికి బిసిసిఐ నుంచి నెలకు 70 వేల వరకు పెన్షన్ వస్తోంది. అయితే ఆర్థికంగా ఎంతో స్థిరంగా ఉన్న ధోని ఈ పెన్షన్ మొత్తాన్ని పూర్తిగా చారిటీ కార్యక్రమాలకు ఇవ్వనున్నట్లు సమాచారం.

ప్రచారాన్ని పెద్దగా కోరుకోని ధోని తన సేవా కార్యక్రమాలను ఎంతో గోప్యంగా ఉంచుతాడు. ఇక ధోనీ లానే మరికొంతమంది ప్రముఖ క్రికెటర్ల పెన్షన్ వివరాలు ఇలా ఉన్నాయి. సచిన్ టెండూల్కర్, సునీల్ గావస్కర్ లకు 70 వేలు, సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ కి 60 వేలు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లే కి 30 వేల పెన్షన్ ఇలా అనేకమంది టీం ఇండియా ఆటగాళ్లు ప్రతి నెల పెన్షన్ ని పొందుతున్నారు.