WATCH Video: స్టేడియంలోనే ప్రేయసికి ప్రపోజ్ చేసిన క్రికెటర్.. వైరలవుతున్న వీడియో..

ఓ అమ్మాయి దగ్గరకు వెళ్లి కించిత్ మోకాళ్లపై కూర్చొని చేతి ఉంగరం తీసుకుని ప్రపోజ్ చేశాడు. ఆమె ముంగిట మోకాళ్ల మీద కూర్చొని తన ప్రేమను వ్యక్తపరిచాడు.స్టేడియంలో..

WATCH Video: స్టేడియంలోనే ప్రేయసికి ప్రపోజ్ చేసిన క్రికెటర్.. వైరలవుతున్న వీడియో..
Kinchit Shah Proposes

Updated on: Sep 01, 2022 | 11:57 AM

ఆసియా కప్ 2022లో భారత జట్టు తన రెండవ మ్యాచ్‌లో కూడా విజయం సాధించింది. టోర్నీలో భాగంగా జరిగిన ఈ రెండో మ్యాచ్‌లో టీమిండియా 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. బుధవారం దుబాయ్ స్టేడియంలో హాంకాంగ్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఈ ఓటమి తర్వాత ఓ హాంకాంగ్ ఆటగాడు తన గర్ల్‌ఫ్రెండ్‌కి ప్రపోజ్ చేసి అందరిని ఆశ్చర్య పరిచాడు. హాంకాంగ్‌ జట్టులో ఆడిన భారత సంతతికి చెందిన కించిత్ షా.. మ్యాచ్‌లో ఓడిపోవడంతో స్టేడియంలో కూర్చున్న తన స్నేహితురాలికి ప్రపోజ్ చేశాడు. ఈ సంఘటన చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోవడమే కాకుండా షాకయ్యారు. భారత్‌తో మ్యాచ్‌ ముగిసిన వెంటనే స్టాండ్స్‌లోకి వెళ్లిన కించిత్.. అక్కడ కూర్చుని మ్యాచ్‌ని వీక్షిస్తున్న తన ప్రేయసికి మోకాళ్లపై కూర్చుని సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు.

కించిత్ ఇలా ప్రపోజ్ చేసింది..

మ్యాచ్ ముగిసిన వెంటనే జట్టు జెర్సీలోనే కించిత్ షా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక్కడి ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. తర్వాత ఓ అమ్మాయి దగ్గరకు వెళ్లి కించిత్ మోకాళ్లపై కూర్చొని చేతి ఉంగరం తీసుకుని ప్రపోజ్ చేశాడు. ఆమె ముంగిట మోకాళ్ల మీద కూర్చొని తన ప్రేమను వ్యక్తపరిచాడు.స్టేడియంలో అందరూ చూస్తుండగా.. ఆమె చేతికి రింగ్ తొడిగాడు. పూర్తి తెల్లటి దుస్తులలో నిలబడి ఉన్న అమ్మాయి చాలా సంతోషించింది. వెంటనే ఆమె కూడా ఓకే చెప్పింది. కించిత్‌ క్యూట్‌ ప్రపోజ్‌కు ఆమె ఫిదా అయిపోయింది.

అనంతరం ఒకరినొకరు కౌగిలించుకుని సంతోషంలో మునిగిపోయారు. దీంతో స్టేడియం ఒక్కసారిగా హోరెత్తిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో టీమిండియా క్రికెటర్‌ దీపక్‌ చహర్‌ సైతం ఇలాగే స్టేడియంలో గర్ల్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్‌ చేసిన వీడియో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది జూన్‌లో వారి వివాహం జరిగింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం