
Gautam Gambhir: దక్షిణాఫ్రికాతో మొహాలీలోని ముల్లన్‌పూర్‌లో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఒక చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఏకంగా ఒకే ఓవర్‌లో 13 బంతులు వేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 11వ ఓవర్ వేయడానికి వచ్చిన అర్ష్‌దీప్ సింగ్ తీవ్రంగా తడబడ్డాడు. ఆ ఓవర్ తొలి బంతిని డికాక్ సిక్సర్‌గా మలిచాడు. ఆ తర్వాత అర్ష్‌దీప్ లైన్ అండ్ లెంగ్త్ పూర్తిగా కోల్పోయాడు. ఆఫ్ స్టంప్ ఆవల బంతిని వేయడానికి ప్రయత్నిస్తూ ఏకంగా 7 వైడ్లు వేశాడు. ఆ ఓవర్‌లో మొత్తం 13 బంతులు విసిరిన అర్ష్‌దీప్, 18 పరుగులు సమర్పించుకున్నాడు.
ఈ ఓవర్‌తో టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో పూర్తి స్థాయి సభ్య దేశాల బౌలర్లలో ‘అత్యధిక బంతులు వేసిన ఓవర్’గా ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ నవీన్-ఉల్-హక్ రికార్డును అర్ష్‌దీప్ సమం చేశాడు. అలాగే, భారత్ తరపున ఈ ఫార్మాట్‌లో సుదీర్ఘ ఓవర్ వేసిన బౌలర్‌గా నిలిచాడు.
IND vs SA : एक, दो या तीन नहीं… अर्शदीप सिंह ने एक ओवर में फेंक दी 7 वाइड, शर्मनाक रिकॉर्ड हुआ नाम…#ArshdeepSingh #CricketNews #WideBall #TeamIndia #CricketUpdate #ViralShorts #TrendingShorts #CricketRecord #INDvsMatch #Bowling pic.twitter.com/kOO27fRX6r
— DD News Rajasthan (@DDNewsRajasthan) December 12, 2025
అర్ష్‌దీప్ వరుసగా వైడ్లు వేస్తుండటంతో డగౌట్‌లో ఉన్న భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. ఆయన కోపంతో ఊగిపోతున్న దృశ్యాలు కెమెరాలకు చిక్కాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 213 పరుగులు చేయగా, ఛేజింగ్‌లో భారత్ 162 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో దక్షిణాఫ్రికా 51 పరుగుల తేడాతో విజయం సాధించి, సిరీస్‌ను 1-1తో సమం చేసింది.