Happy Birthday Dhoni : మహేంద్రుడి భారీ సిక్సులు చూశారా..? నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో

|

Jul 07, 2021 | 6:46 PM

టీమిండియా మాజీ సారథి ధోనీ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా షేకవుతోంది. ఈ మిస్టర్ కూల్‌కి విషెస్ చెబుతూ పలువురు నెట్టింట్లో పలు ఫొటోలతో పోస్టులు పెడుతున్నారు.

Happy Birthday Dhoni :  మహేంద్రుడి భారీ సిక్సులు చూశారా..? నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో
Dhoni Sixes
Follow us on

Happy Birthday Dhoni : టీమిండియా మాజీ సారథి ధోనీ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా షేకవుతోంది. ఈ మిస్టర్ కూల్‌కి విషెస్ చెబుతూ పలువురు నెట్టింట్లో పలు ఫొటోలతో పోస్టులు పెడుతున్నారు. ఆనాటి జ్ఞాపకాలను తలచుకుంటున్నారు. తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా ఓ స్పెషల్ వీడియోను విడుదల చేసి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేసింది. 40వ పుట్టిన రోజు చేసుకుంటున్న జార్ఖండ్ డైనమేట్ అంతర్జాతీయ క్రికెట్‌లో కొట్టిన భారీ సిక్సులను ఈ వీడియోలో పంచుకుంది. 2004 వ సంవత్సరంలో టీమిండియాలోలోకి ఎంట్రీ ఇచ్చి, అనతి కాలంలోనే కెప్టెన్ గా ఎదిగాడు. ఇక అక్కడి నుంచి తనదైన ముద్ర వేస్తూ.. మ్యాచ్ లను రక్తికట్టేంచేవాడు. వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్, సారథిగా ఇలా ఎన్నో బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాడు. 13 సంవత్సరాల పాటు క్రికెట్ లో కొనసాగిన ధోనీ.. తొలుత వన్డేల్లోకి 2004లో ఎంట్రీ ఇచ్చాడు. 350 వన్డేలు ఆడిన జార్ఖండ్ డైనమేట్.. 10,773 పరుగులు చేశాడు. అలాగే 2005 లో టెస్టుల్లో అడుగుపెట్టిన ధోనీ.. 90 మ్యాచులు ఆడి 4,876 పరుగులు సాధించాడు. ఇక టీ20ల్లో 98 మ్యాచులు ఆడిన ధోనీ.. 1,617 పరుగులు సాధించాడు.

ధోనీ 2004లో బంగ్లాదేశ్‌ తో జరిగిన మ్యాచ్‌ తో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఇక ధోనీ కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అంటే, 2005లో పాకిస్తాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్. ఆ సిరీస్‌లో వైజాగ్ వేదికగా జరిగిన లాస్ట్ మ్యాచ్‌లో 123 బంతుల్లో 148 పరుగులతో సత్తా చాటి వెలుగులోకి వచ్చాడు. అనంతరం తన కెరీర్ లో వెనుదిరిగి చూడలేదు ఈ మిస్టర్ కూల్. అదే ఏడాది శ్రీలంక లో 145 బంతుల్లో 183 పరుగులు బాది టీమిండియా తరపున వికెట్‌ కీపర్‌గా అత్యుత్తమ పరుగులు చేసిన ప్లేయర్ గా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్ల బాదిన జాబితాలో ధోనీ 5వ స్థానంలో నిలిచాడు. ధోనీ కెప్టెన్‌గా 2007 టీ20 వ‌రల్డ్‌క‌ప్‌తో పాటు, 2011 వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌, 2013 ఛాంపియ‌న్స్ ట్రోఫీ అందిచాడు. మూడు ఐసీసీ మేజర్‌ ట్రోపీలు సాధించిన ఏకైక కెప్టెన్‌గా అవతరించాడు.
ఆ వీడియోను మీరూ చూడండి:

Also Read:

వెబ్ సిరీస్‌ చివరి ఎపిసోడ్‌ను తలపించిన క్రేజీ బ్యాటింగ్.. 13 గంటలు.. 393 పరుగులు!

India vs Sri lanka: శ్రీలంక టీంకు భారీ దెబ్బ.. టీమిండియా సిరీస్ నుంచి మాజీ కెప్టెన్ ఔట్!