IND vs SA: గంభీర్ ప్రియ శిష్యుడిపై ఐసీసీ సీరియస్.. తొలి వన్డేలో ఆ సైగలపై కీలక చర్య..

హర్షిత్ రానాకు మైదానంలో తన దూకుడు ప్రదర్శించడం కొత్తేమీ కాదు. గత ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్నప్పుడు, 'ఫ్లయింగ్ కిస్' సెలబ్రేషన్‌తో నిబంధనలు ఉల్లంఘించినందుకు బీసీసీఐ అతనిపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై కూడా అదే దూకుడు ప్రదర్శిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

IND vs SA: గంభీర్ ప్రియ శిష్యుడిపై ఐసీసీ సీరియస్.. తొలి వన్డేలో ఆ సైగలపై కీలక చర్య..
Gautam Gambhir Harshit Rana

Updated on: Dec 03, 2025 | 1:28 PM

IND vs SA: టీమిండియా యువ పేసర్ హర్షిత్ రానాకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నుంచి కీలక హెచ్చరిక ఎదుర్కొన్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్‌లో ఐసీసీ ప్రవర్తనా నియమావళిని (Code of Conduct) ఉల్లంఘించినందుకు అతన్ని ఐసీసీ మందలించింది.

అసలేం జరిగిందంటే..?

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 22వ ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రోటీస్ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్‌ను అవుట్ చేసిన తర్వాత, హర్షిత్ రానా డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్లాల్సిందిగా సైగ చేశాడు. రానా చేసిన ఈ పని బ్యాటర్‌ను రెచ్చగొట్టేలా ఉందని భావించి, అతని క్రమశిక్షణ రికార్డులో ఒక డిమెరిట్ పాయింట్‌ను జత చేశారు. కాగా, గత 24 నెలల్లో రానాకు ఇదే మొదటి తప్పు. మ్యాచ్ రిఫరీల ఎమిరేట్స్ ఐసీసీ ఎలైట్ ప్యానెల్‌కు చెందిన రిచీ రిచర్డ్‌సన్ ప్రతిపాదించిన శిక్షను రానా అంగీకరించాడు.

ఇవి కూడా చదవండి

“రిచీ రిచర్డ్‌సన్ ప్రతిపాదించిన శిక్షను రానా అంగీకరించడంతో, దీనిపై అధికారిక విచారణ అవసరం లేకుండా పోయింది” అని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఫీల్డ్ అంపైర్లు జయరామన్ మదనగోపాల్, సామ్ నోగాజ్‌స్కీ, థర్డ్ అంపైర్ రాడ్ టక్కర్, ఫోర్త్ అంపైర్ రోహన్ పండిట్ రానాపై ఈ అభియోగాలు మోపారు.

ఈ ఉత్కంఠభరితమైన సిరీస్ ఓపెనర్‌లో ఆతిథ్య భారత్ 17 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి 1-0 ఆధిక్యాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 349/8 భారీ స్కోరు సాధించింది. విరాట్ కోహ్లీ అద్భుతమైన 135 పరుగులతో తన 52వ వన్డే సెంచరీని నమోదు చేయగా, రోహిత్ శర్మ (57), కేఎల్ రాహుల్ (60) అర్ధశతకాలతో రాణించారు.

ఛేదనలో దక్షిణాఫ్రికా ఆరంభంలోనే తడబడింది. రానా ఒకే ఓవర్‌లో రికెల్టన్ మరియు డి కాక్‌లను పెవిలియన్‌కు పంపి దెబ్బకొట్టాడు. అర్ష్‌దీప్ సింగ్ కెప్టెన్ మార్క్రమ్‌ను అవుట్ చేయడంతో పర్యాటక జట్టు కష్టాల్లో పడింది. మిడిల్ ఆర్డర్‌లో మాథ్యూ బ్రీట్జ్‌కీ, టోనీ డి జోర్జి, డెవాల్డ్ బ్రెవిస్ పోరాడినప్పటికీ, కుల్దీప్ యాదవ్ నాలుగు కీలక వికెట్లు తీసి దక్షిణాఫ్రికా వేగానికి కళ్లెం వేశాడు. చివర్లో జాన్సెన్ మెరుపులు, బాష్ అర్ధశతకం మ్యాచ్‌ను ఉత్కంఠభరితంగా మార్చాయి. చివరి ఓవర్‌లో 19 పరుగులు అవసరం కాగా, ప్రసిద్ధ్ కృష్ణ.. బాష్‌ను అవుట్ చేసి భారత్‌కు విజయాన్ని అందించాడు.

గతంలోనూ వివాదాలు..

హర్షిత్ రానాకు మైదానంలో తన దూకుడు ప్రదర్శించడం కొత్తేమీ కాదు. గత ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్నప్పుడు, ‘ఫ్లయింగ్ కిస్’ సెలబ్రేషన్‌తో నిబంధనలు ఉల్లంఘించినందుకు బీసీసీఐ అతనిపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై కూడా అదే దూకుడు ప్రదర్శిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

క్రికెట్ నిబంధనల ప్రకారం, 24 నెలల వ్యవధిలో ఒక ఆటగాడికి 4 లేదా అంతకంటే ఎక్కువ డిమెరిట్ పాయింట్లు వస్తే, అతన్ని సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి హర్షిత్ రానా భవిష్యత్తులో తన ప్రవర్తనపై జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..