Video: మరోసారి వివాదంలో గంభీర్ శిష్యుడు.. తోటి ఆటగాడిపై బూతుల వర్షం..? వైరల్ వీడియోలో నిజమెంత..!

Harshit Rana Viral Video: భారత యువ పేసర్ హర్షిత్ రాణా మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. శ్రీలంక-Aతో జరిగిన ఏషియా కప్ రైజింగ్ స్టార్స్ సెమీఫైనల్లో సహచర ఆటగాడు షాబాజ్ అహ్మద్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వీడియో వైరల్ అవుతోంది. దీంతో హర్షిత్ ప్రవర్తనపై సోషల్ మీడియాలో అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

Video: మరోసారి వివాదంలో గంభీర్ శిష్యుడు.. తోటి ఆటగాడిపై బూతుల వర్షం..? వైరల్ వీడియోలో నిజమెంత..!
Harshit Rana Abuses Shahbaz Ahmed Video

Updated on: Nov 27, 2026 | 12:21 PM

Harshit Rana Viral Video: టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా మరోసారి తన ప్రవర్తనతో వార్తల్లో నిలిచాడు. ఏషియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 సెమీఫైనల్లో శ్రీలంక-Aతో జరిగిన మ్యాచ్‌లో తన సహచర ఆటగాడిపైనే ఆగ్రహం వ్యక్తం చేశాడు. బౌండరీని ఆపేందుకు ప్రయత్నించిన షాబాజ్ అహ్మద్‌పై హర్షిత్ అసభ్య పదజాలం ఉపయోగించినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో అతడి ప్రవర్తనపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

సహచర ఆటగాడిపైనే హర్షిత్ రాణా ఆగ్రహం..

నవంబర్ 26న భారత్-A, శ్రీలంక-A జట్ల మధ్య ఏషియా కప్ రైజింగ్ స్టార్స్ సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్-A 317 పరుగులు చేసింది. అయితే శ్రీలంక-A జట్టు కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 318 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో భారత్-A 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

ఈ మ్యాచ్‌లో భారత పేసర్ హర్షిత్ రాణా బౌలింగ్‌తో పాటు తన ప్రవర్తన కారణంగా కూడా చర్చల్లో నిలిచాడు. శ్రీలంక బ్యాటింగ్ చేస్తున్న సమయంలో హర్షిత్ వేసిన ఓ ఓవర్‌లో బ్యాటర్ కట్ షాట్ ఆడాడు. బంతి బౌండరీ వైపు దూసుకెళ్లడంతో అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న షాబాజ్ అహ్మద్ ఎడమవైపు పరుగెత్తుకుంటూ వెళ్లి బంతిని ఆపాడు.

అయితే బంతిని ఆపే ప్రయత్నంలో షాబాజ్ కొంత నెమ్మదిగా కదిలాడని భావించిన హర్షిత్ రాణా అసహనం వ్యక్తం చేశాడు. బౌండరీని అడ్డుకున్నప్పటికీ బ్యాటర్లు రెండు పరుగులు తీశారు. దీంతో షాబాజ్‌పై హర్షిత్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసభ్య పదజాలం ఉపయోగించినట్లు వీడియోలో కనిపిస్తోంది.

షాబాజ్ అహ్మద్‌పై విమర్శలు చేయడమేంటి?

ఈ ఘటనపై అభిమానులు హర్షిత్ రాణాను ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఇదే సెమీఫైనల్లో షాబాజ్ అహ్మద్ భారత జట్టు తరపున అద్భుత ప్రదర్శన చేశాడు.

బ్యాటింగ్‌లో 48 బంతుల్లో అజేయంగా 54 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో నాలుగు సిక్సర్లు ఉన్నాయి. బౌలింగ్‌లోనూ ఒక వికెట్ పడగొట్టాడు. ఓవర్‌కు ఆరు పరుగుల ఎకానమీతో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు.

జట్టు కోసం బ్యాట్‌తో, బంతితో రాణించిన ఆటగాడిపైనే హర్షిత్ ఇలా ప్రవర్తించడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు. సహచర ఆటగాళ్లను ప్రోత్సహించాల్సింది పోయి మైదానంలోనే అసభ్యంగా మాట్లాడటం సరికాదని అభిప్రాయపడుతున్నారు.

టోర్నీలో హర్షిత్ రాణా ప్రదర్శన నిరాశాజనకం..

2026 టీ20 ప్రపంచకప్‌కు ముందు మోకాలి గాయం కారణంగా హర్షిత్ రాణా జట్టుకు దూరమయ్యాడు. ఐపీఎల్‌కు కూడా దూరమైన అతడు.. ఈ టోర్నీ ద్వారా మళ్లీ పోటీ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు.

ఆరంభంలో నేపాల్‌పై నాలుగు వికెట్లు తీసి మంచి ప్రదర్శన చేశాడు. అయితే ఆ తర్వాత అతడి బౌలింగ్‌లో నిలకడ కనిపించలేదు. చివరి మూడు మ్యాచ్‌ల్లో నాలుగు వికెట్లు మాత్రమే తీసి.. ప్రతి మ్యాచ్‌లోనూ 60కి పైగా పరుగులు సమర్పించుకున్నాడు.

ఇప్పటికే పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా అతడి ప్రవర్తనపై విమర్శలు వచ్చాయి. తాజాగా సహచర ఆటగాడితో వ్యవహరించిన తీరుతో మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు.

మొత్తానికి ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో హర్షిత్ రాణా ప్రదర్శనతో పాటు అతడి ప్రవర్తన కూడా చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us