
వన్డే ప్రపంచ కప్ ఇంకా చాలా దూరంలోనే ఉంది. కానీ, దానికి ముందు టీ20 ప్రపంచ కప్ సందడి మొదలుకానుంది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు జారీ చేశాడు. టీ20 ప్రపంచ కప్ ప్రారంభానికి కేవలం 10 రోజుల ముందు, బ్రూక్ శ్రీలంక పర్యటనలో తుఫాన్ బ్యాటింగ్‌తో ఊచకోత కోశాడు. తుఫాన్ సెంచరీతో రచ్చలేపాడు. ఇంగ్లాండ్ వర్సెస్ శ్రీలంక మధ్య జరిగిన వన్డే సిరీస్‌లోని మూడవ, చివరి మ్యాచ్‌లో, ఇంగ్లీష్ కెప్టెన్ బ్రూక్ కేవలం 57 బంతుల్లో సెంచరీ సాధించి సంచలనం సృష్టించాడు. బ్రూక్ సెంచరీ ఒక ప్రధాన హెచ్చరికగా మారింది. ఎందుకంటే, టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లు వచ్చే నెలలో శ్రీలంకలోనూ జగనున్న సంగతి తెలిసిందే.
కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో విజయం సాధించినప్పటికీ పిచ్‌ను ప్రశ్నించిన ఇంగ్లాండ్ కెప్టెన్ బ్రూక్, అదే మైదానంలో జరిగిన మూడో వన్డేలో సంచలనం సృష్టించాడు. ఈసారి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. బ్రూక్ శ్రీలంక బౌలర్లను చిత్తు చేసి తన మూడో వన్డే సెంచరీని సాధించాడు. బ్రూక్ కేవలం 66 బంతుల్లో 20 బౌండరీలు (11 ఫోర్లు, 9 సిక్సర్లు) సహా 136 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. ఇది మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టుకు 357 పరుగులు చేయడానికి సహాయపడింది.
వరుసగా మూడో మ్యాచ్‌లో, ఓపెనర్ల వైఫల్యం తర్వాత జో రూట్, జాకబ్ బెథెల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. బెథెల్ అవుట్ అయిన తర్వాత, ఇంగ్లీష్ కెప్టెన్ బ్రూక్ క్రీజులోకి వచ్చాడు. ఆ తర్వాత అతను శ్రీలంక బౌలర్లను లక్ష్యంగా చేసుకుని బౌండరీలో మోత మోగించాడు. బ్రూక్ 49వ ఓవర్ మొదటి బంతికి ఒక పరుగు సాధించడం ద్వారా తన మూడవ వన్డే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. తన సెంచరీని చేరుకున్న తర్వాత, బ్రూక్ తొమ్మిది బంతులు ఎదుర్కొని, మూడు సిక్సర్లు, మూడు ఫోర్లు కొట్టి మొత్తం 36 పరుగులు సాధించాడు.
బ్రూక్ తుఫాన్ బ్యాటింగ్‌తో 32వ ఓవర్లో బ్యాటింగ్‌కు వచ్చి 49వ ఓవర్‌లో సెంచరీ సాధించి షాకిచ్చాడు. ఈ సమయంలో, అతను చాలా ముందుగానే క్రీజులోకి వచ్చిన లెజెండరీ బ్యాట్స్‌మన్ జో రూట్ కంటే ఎక్కువ పరుగులు చేశాడు. రూట్ కూడా సెంచరీ సాధించాడు. బ్రూక్‌తో కలిసి కేవలం 113 బంతుల్లో 191 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు. అదే సమయంలో రూట్ తన 20వ వన్డే సెంచరీని సాధించాడు. అలా చేసిన మొదటి ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ అయ్యాడు. అతను 111 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..