
Hardik Pandya : ఐపీఎల్ 2026 వేలానికి ముందు సౌతాఫ్రికాకు చెందిన 15 మంది ఆటగాళ్లు వేలంలోకి రాబోతున్నారు. ఈ 15 మందిలో ఒక ఆటగాడికి మాత్రం టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తీవ్ర నష్టం కలిగించాడు. ఆక్షన్ ముంగిట తన బ్యాటింగ్‌తో ఆ ఆటగాడి ఫామ్‌ను హార్దిక్ దెబ్బతీశాడు. ఆ ఆటగాడు మరెవరో కాదు, సౌతాఫ్రికా స్టార్ పేసర్ ఎన్రిక్ నోర్ట్జే. వేలానికి రెండు కోట్ల రూపాయల బేస్ ప్రైస్‌తో బరిలోకి దిగుతున్న నోర్ట్జేకు, ఆక్షన్కు సరిగ్గా ముందు ఇలా భారీగా పరుగులు సమర్పించుకోవడం తీవ్ర ఆందోళన కలిగించే విషయం.
ఎన్రిక్ నోర్ట్జే కటక్‌లో జరిగిన భారత్ వర్సెస్ సౌతాఫ్రికా తొలి టీ20 మ్యాచ్‌తో గాయం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి వచ్చాడు. జూన్ 2024 తర్వాత నోర్ట్జే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడటం ఇదే తొలిసారి. కానీ అతనికి ఉండాల్సిన కంబ్యాక్ అనుభవం దక్కలేదు. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా అతనిపై విరుచుకుపడటమే కాకుండా.. తన 4 ఓవర్ల కోటాలో నోర్ట్జే మొత్తం 41 పరుగులు ఇచ్చి, జట్టులో అత్యంత ఖరీదైన బౌలర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో అతనికి ఒక్క వికెట్ కూడా దక్కలేదు.. అతని ఎకానమీ రేట్ 10.25 గా నమోదైంది.
నోర్ట్జేపై అత్యధికంగా పరుగులు సాధించింది హార్దిక్ పాండ్యానే. పాండ్యా, నోర్ట్జే బౌలింగ్‌లో కేవలం 10 బంతులు ఎదుర్కొని ఏకంగా 220 స్ట్రైక్ రేట్‌తో 22 పరుగులు చేశాడు. అంటే తన 4 ఓవర్ల కోటాలో నోర్ట్జే సమర్పించుకున్న 41 పరుగులలో సగానికి పైగా పరుగులు ఒక్క హార్దిక్ పాండ్యాకు మాత్రమే ఇచ్చాడు. ఈ దారుణమైన ప్రదర్శన, ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీలు అతనిపై ఆసక్తి చూపడానికి ముందు తప్పకుండా ఆలోచించేలా చేస్తుంది.
ఐపీఎల్ 2026 వేలానికి ఎంపికైన తర్వాతే ఎన్రిక్ నోర్ట్జే ఈ టీ20 మ్యాచ్ ఆడాడు. వేలం కోసం అతను తన బేస్ ప్రైస్‌ను రూ.2 కోట్లుగా నిర్ణయించుకున్నాడు. అయితే, గాయం నుంచి తిరిగి వచ్చిన తొలి మ్యాచ్‌లోనే ఇలా భారీగా పరుగులు సమర్పించుకోవడంతో, ఈ ధర పెట్టి ఫ్రాంచైజీలు అతన్ని కొంటాయా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే, మరో కోణంలో చూస్తే ఈ నిర్ణయానికి రావడానికి ఇది తొందరపాటు అవుతుంది. ఎందుకంటే ఆక్షన్‌కు ముందు ఈ 5 టీ20 సిరీస్‌లో ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఆ రెండు మ్యాచ్‌లలో నోర్ట్జే తన ఫామ్‌ను తిరిగి నిరూపించుకోగలిగితే అతని బేస్ ప్రైస్ తప్పు కాదని ఫ్రాంచైజీలు భావించే అవకాశం ఉంటుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.