IPL 2026: హార్దిక్ పాండ్య కోసం రంగంలోకి 5 జట్లు.. మెగా వేలంలో కోట్ల వర్షం కురిపించేందుకు రెడీ..!

ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. జట్టు వైఫల్యాలకు తోడు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్, నాయకత్వ శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో, వచ్చే సీజన్ మెగా వేలానికి ముందు ముంబై అతడిని విడుదల చేస్తే, హార్దిక్‌ను దక్కించుకోవడానికి ఐదు ఫ్రాంచైజీలు భారీగా ఖర్చు చేసే అవకాశం కనిపిస్తోంది.

IPL 2026: హార్దిక్ పాండ్య కోసం రంగంలోకి 5 జట్లు.. మెగా వేలంలో కోట్ల వర్షం కురిపించేందుకు రెడీ..!
Hardik Pandya

Updated on: May 15, 2026 | 6:52 AM

ఢిల్లీ క్యాపిటల్స్ గత కొన్ని సీజన్లుగా ఒక బలమైన భారతీయ కెప్టెన్ కోసం వెతుకుతోంది. జట్టులో ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లు ఉన్నప్పటికీ, ఒత్తిడి సమయాల్లో జట్టును నడిపించే అనుభవజ్ఞుడైన నాయకుడు కరువయ్యాడు. గుజరాత్ టైటాన్స్‌కు టైటిల్ అందించిన అనుభవం ఉన్న హార్దిక్ పాండ్యా వేలంలోకి వస్తే, ఢిల్లీ అతడిని కెప్టెన్సీ ఎంపికగా చూసే అవకాశం ఉంది. అతని ఆల్ రౌండ్ నైపుణ్యం జట్టుకు అదనపు బలాన్ని ఇస్తుంది.

లక్నో, చెన్నై జట్ల ఆసక్తి..

లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో నాణ్యమైన బ్యాటర్లు ఉన్నప్పటికీ, ఒక నమ్మదగ్గ భారతీయ ఆల్ రౌండర్ కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా రిషబ్ పంత్ ఈ ఏడాది ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో, నాయకత్వ బాధ్యతలను కూడా హార్దిక్ లాంటి ఆటగాడికి అప్పగించే ఆలోచనలో ఆ జట్టు ఉండవచ్చు. పవర్‌ప్లే తర్వాత వేగంగా పరుగులు రాబట్టడం, డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయగల సామర్థ్యం హార్దిక్‌ను ప్రత్యేకంగా నిలుపుతాయి.

మరోవైపు, అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు పెద్దపీట వేసే చెన్నై సూపర్ కింగ్స్ కూడా హార్దిక్ వైపు మొగ్గు చూపవచ్చు. ఎంఎస్ ధోనీ తర్వాత లోయర్ ఆర్డర్‌లో మ్యాచ్‌లను ముగించగల ఫినిషర్ జట్టుకు అవసరం. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించగల హార్దిక్, భవిష్యత్తులో చెన్నైకి కెప్టెన్‌గా కూడా పనికివస్తాడని మేనేజ్మెంట్ భావించవచ్చు.

రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్ రేసులో..

రాజస్థాన్ రాయల్స్ జట్టుకు మిడిల్ ఆర్డర్‌లో అనుభవజ్ఞుడైన ఫినిషర్ అవసరం ఉంది. కష్టకాలంలో జట్టును ఆదుకోగల హార్దిక్ వంటి ఆటగాడు రాజస్థాన్ బ్యాటింగ్ విభాగానికి కొత్త ఊపిరి పోయగలడు. ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ ఎప్పుడూ మ్యాచ్ విన్నర్ల కోసం భారీగా ఖర్చు చేయడానికి వెనుకాడదు. హార్దిక్ దూకుడైన ఆటతీరు ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై అత్యంత ప్రమాదకరంగా మారుతుంది.

ముంబై ఇండియన్స్ హార్దిక్‌ను విడుదల చేయడంపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ప్రస్తుత పరిస్థితులు, మెగా వేలం నేపథ్యంలో, హార్దిక్ గనుక వేలంలోకి వస్తే కోట్లాది రూపాయల వర్షం కురవడం ఖాయమని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us