IND vs AFG : ఫ్యాన్స్‌కు క్రేజీ అప్‌డేట్.. 15 నెలల తర్వాత వన్డేల్లోకి ముంబై ఇండియన్స్ కెప్టెన్‌

IND vs AFG : వచ్చే ఏడాది (2027) ఆఫ్రికా గడ్డపై జరగబోయే ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌కు భారత జట్టు సన్నద్ధమవడానికి ఈ సిరీస్ తొలి అడుగు కానుంది. ఈ మెగా టోర్నీ కంటే ముందు భారత్ మొత్తం 45 వన్డేలు ఆడాల్సి ఉంది.

IND vs AFG : ఫ్యాన్స్‌కు క్రేజీ అప్‌డేట్.. 15 నెలల తర్వాత వన్డేల్లోకి ముంబై ఇండియన్స్ కెప్టెన్‌
Hardik Pandya

Updated on: Jun 05, 2026 | 4:49 PM

IND vs AFG : భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య జూన్ 6 నుంచి జరగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్ ముగిసిన వెంటనే.. ఇరు జట్లు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తలపడనున్నాయి. జూన్ 13న ధర్మశాలలో మొదటి వన్డే, జూన్ 17న లక్నోలో రెండో వన్డే, జూన్ 20న చెన్నైలో చివరి వన్డే మ్యాచ్ జరగనుంది. వచ్చే ఏడాది (2027) ఆఫ్రికా గడ్డపై జరగబోయే ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌కు భారత జట్టు సన్నద్ధమవడానికి ఈ సిరీస్ తొలి అడుగు కానుంది. ఈ మెగా టోర్నీ కంటే ముందు భారత్ మొత్తం 45 వన్డేలు ఆడాల్సి ఉంది. అయితే ఈ సిరీస్ ప్రారంభానికి ముందే స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్‌పై ఒక కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది.

ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 19వ సీజన్‎లో ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యాకు ఆ టోర్నీ ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. అతని నాయకత్వంలోని ముంబై జట్టు 14 మ్యాచ్‌లలో కేవలం 4 విజయాలు నమోదు చేసి, పాయింట్ల పట్టికలో 9వ స్థానంతో సరిపెట్టుకుంది. వ్యక్తిగతంగా కూడా హార్దిక్ కేవలం 200 పైచిలుకు పరుగులు చేసి, 4 వికెట్లు మాత్రమే తీశాడు. కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. దీనికి తోడు వెన్నునొప్పి సమస్యల కారణంగా ముంబై ఆడిన 4 కీలక మ్యాచ్‌లకు హార్దిక్ దూరమయ్యాడు. 2018 లో జరిగిన మేజర్ వెన్ను సర్జరీ తర్వాత నుంచి హార్దిక్ తన వర్క్‌లోడ్‌ను తగ్గించుకుంటూ వస్తున్నాడు.

ఐపీఎల్ ముగిసిన తర్వాత హార్దిక్ పాండ్యా కాస్త రిలాక్స్ అవ్వడానికి ఫ్రాన్స్ రాజధాని పారిస్‌కు వెకేషన్‌కు వెళ్లాడు. అక్కడ విహారయాత్ర ముగించుకున్న వెంటనే ఆయన నేరుగా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‎కు చేరుకున్నాడు. అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికైనప్పటికీ, అతను పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తేనే జట్టు మేనేజ్‌మెంట్ తుది జట్టులోకి తీసుకోనుంది. అందువల్ల జూన్ 10 వరకు హార్దిక్ బెంగళూరులోనే ఉండి ఎన్‌సీఏ వైద్య సిబ్బంది పర్యవేక్షణలో రిహాబిలిటేషన్ ట్రైనింగ్ తీసుకోనున్నాడు. నేషనల్ క్రికెట్ అకాడమీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే జూన్ 11న ధర్మశాలలో టీమిండియాతో కలుస్తాడు.

ప్రముఖ క్రీడా వెబ్‌సైట్ క్రిక్‌బజ్ కథనం ప్రకారం.. హార్దిక్ పాండ్యా వేగంగా కోలుకుంటున్నాడని, అఫ్గాన్ సిరీస్ సమయానికి పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడని తెలిసింది. గత 15 నెలలుగా హార్దిక్ ఎలాంటి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడలేదు. కాబట్టి ఈ సిరీస్ అతనికి చాలా కీలకం. కాగా, ఇదే సిరీస్‌కు ఎంపికైన కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఐపీఎల్‌లో హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా 6 మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అయితే హార్దిక్ పాండ్యా మాత్రమే బెంగళూరులోని ఫిట్‌నెస్ టెస్టుకు హాజరవగా, రోహిత్ శర్మ ఇంకా రిపోర్ట్ చేయలేదని సమాచారం. రోహిత్ శర్మ అందుబాటుపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us