Hardik Pandya: T20 ప్రపంచ కప్ విజయాన్ని కొడుకుతో కలిసి సెలబ్రేట్ చేసుకున్న హార్దిక్.. కనిపించని నటాషా.. వీడియో

|

Jul 05, 2024 | 10:23 PM

అనుభవజ్ఞుడైన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా టీ20 ప్రపంచకప్ లో అద్భుతంగా రాణించాడు. భారత్ విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. . ముఖ్యంగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పాండ్యా మూడు ఓవర్లలో 20 పరుగులిచ్చి మూడు ముఖ్యమైన వికెట్లు తీశాడు

Hardik Pandya: T20 ప్రపంచ కప్ విజయాన్ని కొడుకుతో కలిసి సెలబ్రేట్ చేసుకున్న హార్దిక్.. కనిపించని నటాషా.. వీడియో
Hardik Pandya
Follow us on

అనుభవజ్ఞుడైన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా టీ20 ప్రపంచకప్ లో అద్భుతంగా రాణించాడు. భారత్ విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. . ముఖ్యంగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పాండ్యా మూడు ఓవర్లలో 20 పరుగులిచ్చి మూడు ముఖ్యమైన వికెట్లు తీశాడు. భారత జట్టు ఇప్పుడు దేశానికి తిరిగి వచ్చింది. జట్టులోని ఆటగాళ్లందరూ ఈ విజయాన్ని తమ అభిమానులతో గురువారం (జూలై 4న) జరుపుకొన్నారు. ఆ తర్వాత భారత జట్టులోని ఆటగాళ్లందరూ తమ ఇళ్లకు తిరిగివచ్చి కుటుంబసభ్యులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. వారిలో హార్దిక్ పాండ్యా కూడా ఉన్నాడు. టీ20 ప్రపంచకప్ గెలిచి స్వదేశానికి వచ్చిన హార్దిక్ పాండ్యా ఈ టీ20 ప్రపంచకప్ విజయాన్ని తన కుటుంబంతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. హార్దిక్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన ఈ ఫోటోలలో హార్దిక్ పాండ్యా కుమారుడు అగస్త్య మాత్రమే కనిపిస్తున్నాడు. కానీ అతని భార్య నటాషా మాత్రమే కనిపించలేదు.

తన కొడుకుతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన పాండ్యా.. ‘నా నంబర్ వన్ ! నేనేం చేసినా నీ కోసమే చేస్తాను’ అని రాసుకున్నాడు. అయితే ఈ ఫోటోల్లో హార్దిక్ భార్య నటాషా మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీంతో వీరిద్దరి వైవాహిక బంధంలో చీలిక వచ్చిందన్న వార్తలకు మరింత బలం చేకూరుతోంది. అలాగే మరోసారి వీరి విడాకుల పుకార్లు తెరపైకి వచ్చాయి.

ఇవి కూడా చదవండి

టీ20 ప్రపంచకప్‌లో హార్దిక్ పాండ్యా అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ టోర్నీలో పాండ్యా బ్యాట్‌తో 144 పరుగులు చేసి బౌలింగ్‌లో 11 వికెట్లు పడగొట్టాడు. ఫైనల్ మ్యాచ్ లోనూ తన బౌలింగ్ తో సంచలనం సృష్టించాడు. మూడు ఓవర్లలో 20 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇది కాకుండా, అతను చివరి ఓవర్లో 16 పరుగులు డిఫెండ్ చేశాడు. టీ20 ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో పాండ్యాకు బహుమతి లభించడంతో పాటు తాజాగా టీ20 ఆల్‌రౌండర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..