టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ రేసులో ఉండటానికి టీమ్ ఇండియా తమ చివరి రెండు మ్యాచ్‌లను భారీ తేడాతో గెలిచేందుకు ఫిక్సింగ్‌కు పాల్పడిందని పాకిస్తాన్ అభిమానులు ఆరోపిస్తున్నారు. ఆఫ్ఘానిస్తాన్, స్కాట్లాండ్పై భారీ తేడాతో గెలవడంపై అనుమానంగా ఉందంటూ కొందరు పాక్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. దీంతో పాక్ అభిమానులపై టీంఇండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ విరుచుకుపడ్డాడు. శనివారం హర్భజన్ తన యూట్యూబ్ ఛానెల్లో ”మీ చెత్తవాగుడు కట్టిపెడితే బాగుంటుంది. పాకిస్తాన్ చాలా మంచి క్రికెట్ ఆడిందని మేము అంగీకరిస్తున్నాం. భారతదేశంపై చాలా బాగా ఆడినందుకు ప్రతి ఒక్కరూ వారిని అభినందిస్తున్నారు. కానీ ఇలా చేయడం మంచిది కాదు” అని హర్భజన్ సింగ్ అన్నాడు. “మీ క్రికెటర్ల ప్రతిష్ట మా అందరికీ తెలుసు. ఇన్నేళ్ల పాటు ప్రపంచకప్‌లో భారత్‌పై విజయం సాధించలేకపోడాన్ని పాక్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. రషీద్ ఖాన్‌పై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఇది చాలా అవమానకరమైనది ”అని చెప్పాడు.
పాకిస్తాన్, న్యూజిలాండ్‌లతో జరిగి మ్యాచ్‌ల్లో భారత్ వరుసగా 10, 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. కానీ విరాట్ కోహ్లి జట్టు వారి తదుపరి రెండు మ్యాచ్‌లలో పుంజుకుంది, ఆఫ్ఘనిస్తాన్‌ను 66 పరుగుల తేడాతో, స్కాట్లాండ్ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. ఇదంతా కష్టపడితే వచ్చింది. ఇలాంటి వ్యాఖ్యలు క్రికెట్‌పై ఉండే గౌరవాన్ని దెబ్బ తీస్తుందని పేర్కొన్నాడు. ఆఫ్ఘనిస్తాన్ చేతిలో న్యూజిలాండ్ ఓడిపోతే భారత్ సెమీస్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇండియా సోమవారం నమీబీయాతో ఆడనుంది. గ్రూప్-2లో భారత్ ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. మొదటి, రెండో స్థానాల్లో పాకిస్తాన్, కివీస్ ఉన్నాయి.
Stop this nonsense trend on Twitter .. https://t.co/i80qeUAMJq
— Harbhajan Turbanator (@harbhajan_singh) November 6, 2021
Read Also… Chris Gayle: మిచెల్ మార్ష్‌ను ఔట్ చేసిన గేల్.. తర్వాత ఏం చేశాడంటే.. వైరల్ అవుతోన్న వీడియో..
Chris Gayle: క్రిస్ గేల్ రిటైర్మెంట్ తీసుకున్నాడా.. వెస్టిండీస్ ఆటగాళ్లు ఎందుకు అలా చేశారు..