Virender Sehwag Birthday: అక్టోబర్ 20 న 43 వ ఏట అడుగుపెట్టిన వీరేంద్ర సెహ్వాగ్ మైదానంలోనే కాదు.. వెలుపల కూడా తనదైన ముద్ర వేశాడు. మైదానంలో అతని తుఫాన్ బ్యాటింగ్‌తో ప్రత్యర్థులపై ఆధిపత్యం ప్రదర్శించేవాడు. ఎందరో బౌలర్లకు నిద్రలేని రాత్రులను మిగిల్చాడు. అనంతరం క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సెహ్వాగ్.. ‘సోషల్ మీడియా’లో చమత్కార ట్వీట్లకు మారుపేరుగా నిలిచాడు. సందేశాలలో చమత్కారాన్ని జోడించి అటు అభిమానులతోపాటు నెటిజన్లను కూడా ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో తనదైన స్టైల్‌లో నవ్వులు పూయిస్తుంటాడు.
13 సంవత్సరాల పాటు సాగిన కెరీర్‌లో ఎన్నో అద్భుత ఇన్నింగ్స్‌లకు మారుపేరుగా నిలిచాడు. సెహ్వాగ్ 104 టెస్టులు, 251 వన్డేలు, 19 టీ20 లు, 104 ఐపిఎల్ మ్యాచ్‌లు ఆడాడు. టెస్ట్ క్రికెట్‌లో 23 సెంచరీలు, ఆరు డబుల్ సెంచరీలతో 8,586 పరుగులు చేసిన సెహ్వాగ్.. తక్కువ కాలంలోనే ఎన్నో ఘనతలు సాధించాడు. వన్డేల్లో 82 బంతుల్లో డబుల్ సెంచరీ చేసిన డాషింగ్ బ్యాట్స్‌మెన్ 8273 పరుగులు పూర్తి చేశాడు.
అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కూడా సెహ్వాగ్ రెండు సెంచరీలు చేశాడు. అతని బ్యాటింగ్‌తోనే కాదు.. సెహ్వాగ్ బంతితో కూడా ఆకట్టుకున్నాడు. రైట్ ఆర్మ్ ఆఫ్‌బ్రేక్‌గా బౌలింగ్ చేసిన సెహ్వాగ్ టెస్టు క్రికెట్‌లో 40 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో 96 వికెట్లు సాధించాడు. అలాగే ఐపీఎల్‌లో 6 వికెట్లు పడగొట్టాడు.
‘నవాఫ్ ఆఫ్ నజాఫ్‌గఢ్’ ఎల్లప్పుడూ చమత్కారమైన మెసేజ్‌లతో ఆకట్టుకుంటాడేని తెలిసిందే. ఎలాంటి సీన్‌కైనా ఒక జోక్ సిద్ధంగా ఉంటుంది. ‘విరు’ తన అభిమానులను ఎల్లప్పుడూ సంతోషం కలిగించేందుకు తనదైన స్టైల్‌లో ట్వీట్లు చేస్తుంటాడు.
సెహ్వాగ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన పంచుకున్న కొన్ని ఫన్నీ ట్వీట్లు మీకోసం:
అక్టోబర్ 2016 లో జరిగిన కబడ్డీ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై భారత్ విజయం సాధించడంతో ఆంగ్లేయులను ట్రోల్ చేస్తూ..
England loose in a World Cup again.Only the sport changes.This time it’s Kabaddi.
India thrash them 69-18.All the best for semis
#INDvENG— Virender Sehwag (@virendersehwag) October 18, 2016
రవిచంద్రన్ అశ్విన్‌ను అభినందిస్తూ ఒక ఫన్నీ ట్వీట్..
Congrats @ashwinravi99 for an incredible 7th Man of the series.
Only a married man can understand d urgency of going home early.#FamilyTime— Virender Sehwag (@virendersehwag) October 11, 2016
విరాట్ బ్యాటింగ్‌ను అభినందిస్తూ..
Haazme ki goli, Rangon ki holi,
Aur batting me kohli
Poore India ko pasand hain— Virender Sehwag (@virendersehwag) October 16, 2016
పెళ్లి టిప్స్ అందిస్తూ..
With wife be like u r at non-striker end.Let her do the talking & run when you need to #mybestpartner#ViruKaGyaan pic.twitter.com/x8R2qZN7dF
— Virender Sehwag (@virendersehwag) September 2, 2016
రాహుల్ తెవాటియాను అభినందిస్తూ..
Tewatia kuchh bhi kar sakte hain.
Agar Covid vaccine banane ka ek mauka mil gaya, toh jaisa unka time chal raha hai , lagta hai bana denge. What a season for him. #RRvRCB pic.twitter.com/WYY5mojrKC— Virender Sehwag (@virendersehwag) October 17, 2020