Happy Birthday Kapil Dev: భారత క్రికెట్ జట్టుకు తొలి ప్రపంచకప్ ట్రోఫీని అందించిన కపిల్ దేవ్ నేడు 63వ పుట్టినరోజు చేసుకొంటున్నాడు. ఆయన 1959వ సంవత్సరంలో పంజాబ్‌లోని చండీగఢ్‌లో ఇదే రోజున జన్మించారు. భారత క్రికెట్ జట్టులో చేరడం ద్వారా గొప్ప స్థానాన్ని సాధించాడు. కపిల్ దేవ్ పాత్రను ప్రపంచం మొత్తం గుర్తుంచుకుంటుంది. కపిల్ దేవ్ ప్రస్తుతం క్రికెట్ నిపుణుడి పాత్రలో కనిపిస్తున్నాడు.
కపిల్ దేవ్ జీవితం కూడా హెచ్చు తగ్గులతో నిండి ఉంది. భారతదేశం, పాకిస్తాన్ మధ్య విభజన సమయంలో అతని తల్లిదండ్రులు రావల్పిండి నుంచి పంజాబ్‌కు వలస వచ్చారు. కపిల్ తండ్రి రామ్ లాల్ నిఖాంజ్ కలప కాంట్రాక్టర్. కపిల్ దేవ్‌కు మొదటి నుంచి క్రికెట్‌పై మొగ్గు ఉండేది. ఆటగాడిగానే కాకుండా కెప్టెన్‌గా కూడా రాణించి జట్టును ముందుకు తీసుకెళ్లడంతోపాటు దేశానికి తొలి ప్రపంచ కప్ అందించాడు.
చరిత్రాత్మకం ఆ విజయం..
1983 ప్రపంచకప్‌ను మరచిపోవాలని ఏ భారతీయుడు కోరుకోడు. జింబాబ్వేపై 175 పరుగులు చేసి జట్టును గెలిపించడంలో కీలకపాత్ర పోషించిన కపిల్.. 175 పరుగుల ఈ ఇన్నింగ్స్‌కు కేవలం 138 బంతులు మాత్రమే తీసుకున్నాడు. కీలకమైన ఈ మ్యాచులో గెలిచి ఫైనల్ చేరుకోవడంలో కీలకపాత్ర పోషించాడు ఈ భారత దిగ్గజం.
1983లో ఇంగ్లండ్‌లో జరిగిన ప్రపంచకప్‌లో కపిల్ దేవ్ సారథ్యంలో భారత్‌కు చారిత్రాత్మక విజయం లభించింది. కపిల్ దేవ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు. ఆడిన 8 మ్యాచ్‌లలో ఒక్కసారి కూడా విఫలం కాలేదు. అతను 8 ఇన్నింగ్స్‌లలో 60.6 సగటుతో 303 పరుగులతో టోర్నమెంట్‌లో ఐదవ అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ముఖ్యంగా 108.99 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించాడు.
1983 జూన్ 25న భారత్ ప్రపంచకప్ గెలిచింది..
25 జూన్ 1983న, భారత జట్టు వెస్టిండీస్‌పై 43 పరుగుల తేడాతో గెలిచి ప్రపంచకప్‌ను గెలుచుకుంది. 1983 ప్రపంచ కప్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన కపిల్.. తన బ్యాట్‌తో 303 పరుగులు చేశాడు. అదే సమయంలో 12 వికెట్లు, 7 క్యాచ్‌లు తీసుకున్నాడు. కపిల్ దేవ్ 11 మార్చి 2010న ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి ప్రవేశించారు.
వెస్టిండీస్‌పై అద్భుత ప్రదర్శన..
వెస్టిండీస్‌పై కపిల్ దేవ్ ఒక ఇన్నింగ్స్‌లో తొమ్మిది వికెట్లు తీసి అద్భుతాలు చేశాడు. 16 నవంబర్ 1983న అహ్మదాబాద్ టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 30.3 ఓవర్లలో కేవలం 83 పరుగులు మాత్రమే ఇచ్చి తొమ్మిది మంది బ్యాట్స్‌మెన్‌లకు కపిల్ దేవ్ పెవిలియన్ దారి చూపించాడు.
కపిల్ జీవితంపై సినిమా
విశేషమేమిటంటే, కపిల్ దేవ్ జీవితంపై ’83’ చిత్రం కూడా తీశారు. రణవీర్ సింగ్, దీపికా పదుకొనే, పంకజ్ త్రిపాఠి తదితరులు నటించిన ఈ సినిమా 1983 సంవత్సరంలో భారత్ మొదటి క్రికెట్ ప్రపంచ కప్ విజయానికి సంబంధించిన కథ. ఈ చిత్రంలో కపిల్ దేవ్ పాత్రలో రణవీర్ సింగ్ నటించాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా రాణించలేకపోయింది.
కపిల్ గణాంకాలు..
5000 & 400: టెస్ట్ క్రికెట్‌లో 5000 కంటే ఎక్కువ పరుగులు, 400 కంటే ఎక్కువ వికెట్లు సాధించారు.
కపిల్ దేవ్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో 5000-ప్లస్ పరుగులు, 400-ప్లస్ వికెట్లు సాధించాడు. అలాగే ఏకైక డబుల్ సెంచరీని కూడా సాధించిన ఆటగాడిగా నిలిచాడు. కపిట్ 131 టెస్టుల్లో 29.64 సగటుతో 8 సెంచరీలు, 434 వికెట్లతో సహా 5248 పరుగులతో తన కెరీర్‌ను ముగించాడు.
434: టెస్టు క్రికెట్‌లో వికెట్ల సంఖ్య..
కపిల్ దేవ్ 131 టెస్టుల్లో 29.64 సగటుతో 63.9 స్ట్రైక్ రేట్‌తో 434 వికెట్లు తీశాడు. టెస్టు క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఘనత అనిల్ కుంబ్లే పేరుపై నిలిచింది. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన 9వ బౌలర్‌గా కపిల్ నిలిచాడు.
109తో అద్భుత ఇన్నింగ్స్..
కపిల్ దేవ్ 1988లో చెన్నైలో వెస్టిండీస్‌తో జరిగిన నాల్గవ, చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లకు 156 పరుగుల వద్ద బ్యాటింగ్‌కు దిగి 124 బంతుల్లో 18 బౌండరీలతో అద్భుతమైన 109 పరుగులు చేశాడు. భారత్ 382 పరుగులు చేసింది. ఆ తర్వాత నరేంద్ర హిర్వానీ అరంగేట్రంలోనే 16 వికెట్లు పడగొట్టి భారత్‌కు 255 పరుగులతో సిరీస్-లెవలింగ్ విజయాన్ని అందించాడు.
95.07 వన్డే స్ట్రైక్ రేట్
కపిల్ దేవ్ వన్డే స్ట్రైక్ రేట్ 95.07గా ఉంది. ప్రపంచంలోనే రెండవ అత్యధిక స్ట్రైక్ రేట్‌గా నిలిచింది.
Also Read: Pujara Comments: రెండో టెస్ట్‌లో టీమిండియా గెలుస్తుందా..! వ్యూహం ఏంటి..? పూజారా కామెంట్స్..
IND vs SA: రిషబ్ పంత్ ఇదేం ఆట.. ఆగ్రహం వ్యక్తం చేసిన సునీల్ గవాస్కర్..