Happy birthday Joe Root: ఇంగ్లండ్‌కు టెస్టుల్లో ఇది సరైన సంవత్సరం కాకపోవచ్చు. ముఖ్యంగా ఇటీవలి యాషెస్ ఓటమితో అలా అనిపిస్తోంది. అయితే ఒక వ్యక్తి మాత్రం ప్రత్యేకంగా నిలిచాడు. ఆయనే ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్. అతను ఈ సంవత్సరం మొత్తం 1708 పరుగులు సాధించాడు. ఒక క్యాలెండర్ సంవత్సరంలో ఒక బ్యాటర్ సాధించిన అత్యధిక పరుగుల లిస్టులో మూడవ స్థానంలో నిలిచాడు. జోరూట్ 31వ పుట్టినరోజు సందర్భంగా 2021లో ఆయన బెస్ట్ ఇన్నింగ్స్‌లను ఓసారి చూద్దాం..
228 vs శ్రీలంక:
గాలేలో శ్రీలంకతో జరిగిన తొలి ఇన్నింగ్స్‌లో జో రూట్ అద్భుతమైన డబుల్ సెంచరీతో ఈ సంవత్సరాన్ని ప్రారంభించాడు. అతని ఇన్నింగ్స్ అద్భుతమైన విజయానికి మార్గం సుగమం చేసింది. ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది.
186 vs శ్రీలంక:
శ్రీలంక మొదటి ఇన్నింగ్స్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి 381 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లు అంతా కుప్పకూలినప్పుడు, రూట్ బలంగా నిలబడ్డాడు. అతని జట్టు గౌరవప్రదమైన 344 పరుగులకు చేరుకోవడం కోసం 186 పరుగుల సూపర్ నాక్ ఆడాడు. శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 126 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్‌కు స్కోర్‌ను ఛేజింగ్ చేయడంలో అసలు సమస్యే లేదు. దీంతో ఇంగ్లండ్ మరోసారి అద్భుత విజయం సాధించింది.
218 vs భారత్:
భారతదేశంలో, ముఖ్యంగా చెన్నై వంటి వేదికపై భారత్‌తో ఆడడం అంత సులభం కాదు. అయితే రూట్‌కు ఇది ఎలాంటి సమస్య కాలేదు. ఎందుకంటే అతను మొదటి ఇన్నింగ్స్‌లో 218 పరుగులు చేయడంతో సిరీస్‌లోని మొదటి టెస్టులో ఇంగ్లండ్‌ను ఆధిక్యంలో నిలిపాడు. ఈ టెస్టులో ఇంగ్లండ్ 227 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
180* vs భారత్:
రూట్ సూపర్ నాక్ ఈసారి ఇంగ్లండ్‌కు సహాయడలేదు. ఆగస్టులో లార్డ్స్‌లో జరిగిన 2వ టెస్టులో కేఎల్ రాహుల్ చేసిన సెంచరీతో భారత్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 364 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్ 391 పరుగులకు కుప్పకూలింది. టీమిండియా రెండవ ఇన్నింగ్స్‌లో 298 పరుగులు చేసింది. ఆపై ఇంగ్లండ్‌ను 120 పరుగులకే ఆలౌట్ చేసి 151 పరుగుల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది.
Also Read: IND vs SA: చారిత్రాత్మక విజయంలో ‘ఆ నలుగురిదే’ కీలకపాత్ర.. సెంచూరియన్‌లో సత్తా చాటిన పేస్ దళం..!
Ranji Trophy: ఆ రంజీ జట్టులో సచిన్ తనయుడు.. జనవరి 13న అరంగేట్రం చేసే అవకాశం..!