Shardul Thakur: ఆ సిక్సర్ గురించి ముందస్తు ప్రణాళిక ఏం రచించలేదు.. క్రీజు నుంచి బయటకి వచ్చి భారీషాట్ ఆడానంతే..

|

Jan 27, 2021 | 12:00 AM

Shardul Thakur: ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్ట్‌లో తన బ్యాటింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు టీం ఇండియా ప్లేయర్ శార్దూల్‌ ఠాకూర్‌.

Shardul Thakur: ఆ సిక్సర్ గురించి ముందస్తు ప్రణాళిక ఏం రచించలేదు.. క్రీజు నుంచి బయటకి వచ్చి భారీషాట్ ఆడానంతే..
Follow us on

Shardul Thakur: ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్ట్‌లో తన బ్యాటింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు టీం ఇండియా ప్లేయర్ శార్దూల్‌ ఠాకూర్‌. ఓ నేషనల్‌ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో బౌలర్‌గా కాకుండా మొదటిసారి ఓ బ్యాట్స్‌మెన్‌గా సమాధానం చెప్పాడు. బ్రిస్బేన్‌ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో శార్దూల్ అర్ధశతకంతో పాటు ఏడు వికెట్లు పడగొట్టిన సంగతి తెలిసిందే.

అయితే ఆ మ్యాచ్‌లో కొట్టిన సిక్సర్ల గురించి ప్రస్తావన రాగా అందుకోసం ప్రత్యేక ప్రణాళిక చేసుకోలేదని బదులిచ్చాడు. లైయన్‌ చక్కగా బౌలింగ్‌ చేశాడని ఎన్నో బంతులు డిఫెండ్ చేశానని అన్నాడు. లెగ్‌సైడ్‌లో బౌండరీ లైన్‌లో ముగ్గురు ఫీల్డర్లను ఉంచడంతో భారీ షాట్లు ఆడలేకపోయానని చెప్పాడు. ఇక సిక్సర్‌ విషయానికొస్తే దాని కోసం ఎలాంటి ప్లాన్‌ చేయలేదని బంతి వేస్తున్నప్పుడు క్రీజు నుంచి బయటకి వచ్చి భారీషాట్ ఆడానని పేర్కొన్నాడు. అతడు ఆడిన షాట్‌లు, ఫుట్‌వర్క్‌ను క్రికెటర్లు, మాజీలు కొనియాడారు. అయితే పేసర్‌ కమిన్స్‌ బౌలింగ్‌లో హుక్‌షాట్‌తో సిక్సర్‌ బాది పరుగుల ఖాతా తెరవడం, స్పిన్నర్‌ లైయన్‌ బౌలింగ్‌లో లాఫ్టెడ్‌ షాట్‌తో మరో సిక్సర్‌తో హాఫ్‌సెంచరీ చేయడం మ్యాచ్‌కి హైలైట్‌గా నిలిచిందని పొగిడారు.