గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ అదరగొట్టాడు. గత మ్యాచుల్లో పెద్గగా ఆకట్టుకోని ఈ టీమిండియా ప్రిన్స్ సొంత గడ్డపై పంజాబ్ కింగ్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఓపెనర్ గా బరిలోకి దిగిన శుభ్‌మన్ గిల్ కేవలం 48 బంతుల్లో 4 సిక్సర్లు, 6 ఫోర్ల సాయంతో 89 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు కూడా తలా ఓ చేయి వేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. కాగా ఈ మ్యాచ్ లో పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా 11 పరుగులు చేశాడు. కేన్ విలియమ్సన్ 26 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో కేన్ 4 ఫోర్లు కొట్టాడు. సాయి సుదర్శన్ 19 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 33 పరుగులు చేశాడు. విజయ్ శంకర్ 8 పరుగులు చేసి వెనుదిరిగాడు. రాహుల్ తెవాటియా 23 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. పంజాబ్ కింగ్స్ తరఫున అత్యధికంగా కగిసో రబడా 2 వికెట్లు తీశాడు. హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్ చెరో వికెట్ తీశారు.
Shub bolo ___ 💙
Complete the chant.#AavaDe | #GTKarshe | #TATAIPL2024 | #GTvPBKS pic.twitter.com/uJ8P9r3T9L
— Gujarat Titans (@gujarat_titans) April 4, 2024
కాగా ఇదే మ్యాచ్ లో గుజరాత్ తరఫున ఓ అరుదైన ఘనత అందుకున్నాడు గిల్. ఆ జట్టు తరఫున 1500 పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
𝐌𝐢𝐥𝐞𝐬𝐭𝐨𝐧𝐞 𝐮𝐧𝐥𝐨𝐜𝐤𝐞𝐝 🔓
1️⃣5️⃣0️⃣0️⃣ runs for GT ✅#AavaDe | #GTKarshe pic.twitter.com/Y9FpQlpcsX
— Gujarat Titans (@gujarat_titans) April 4, 2024
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ -XI)
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, దర్శన్ నల్కండే.
BR శరత్, మోహిత్ శర్మ, సందీప్ వారియర్, అభినవ్ మనోహర్, మానవ్ సుతార్
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ -XI)
శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, ప్రభ్సిమ్రాన్ సింగ్, సామ్ కర్రాన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), శశాంక్ సింగ్, సికందర్ రజా, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్, కగిసో రబాడ.
తాన్య త్యాగరాజన్, నాథన్ ఎల్లిస్, అశుతోష్ శర్మ, రాహుల్ చాహర్, విద్వత్ కవీరప్ప
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..