Gujarat Titans vs Chennai Super Kings Qualifier 1 Playing XI & Imapct Players: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఈ సీజన్ క్వాలిఫయర్-1లో నేడు గుజరాత్ టైటాన్స్ (GT), చెన్నై సూపర్ కింగ్స్ (CSK), మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం (చెపాక్)లో మొదలైంది. లీగ్ చరిత్రలో ప్లే ఆఫ్స్‌లో ఈ రెండు జట్లు తొలిసారి తలపడనున్నాయి. ఈమేరకు టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. గుజరాత్ తరపున యశ్ దయాల్ స్థానంలో దర్శన్ నల్కండేకి అవకాశం లభించగా, ధోనీ తన టీంను మార్చలేదు.
గుజరాత్‌లో ఇది రెండో సీజన్ మాత్రమే. గతేడాది జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. ఇక చెన్నై గ్రూప్ దశ నుంచే నిష్క్రమించింది. అయితే, CSK ఓవరాల్‌గా 12వ సారి ప్లేఆఫ్స్‌కు చేరుకుంది.
క్వాలిఫయర్-1లో గెలుపొందిన జట్టు ఫైనల్‌లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంటుంది. కాగా, ఓడిన జట్టుకు ఫైనల్‌కు చేరేందుకు మరో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో.. క్వాలిఫయర్-2లో తలపడాల్సి వస్తుంది.
? Toss Update ?@gujarat_titans win the toss and elect to field first against @ChennaiIPL.
Follow the match ▶️ https://t.co/LRYaj7cLY9 #TATAIPL | #Qualifier1 | #GTvCSK pic.twitter.com/Bhj5g0Gv30
— IndianPremierLeague (@IPL) May 23, 2023
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్, వృద్ధిమాన్ సాహా(కీపర్), హార్దిక్ పాండ్యా(కెప్టెన్), దాసున్ షనక, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, దర్శన్ నల్కండే, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ.
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, అంబటి రాయుడు, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(కీపర్/కెప్టెన్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..