LSG Vs RCB: ఆ ఇద్దరిని పీకేస్తే దరిద్రం పోద్ది.. వాళ్ల వల్ల ఏకంగా రూ. 48 కోట్ల నష్టం.. ఎవరంటే.?

ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ వరుస ఓటములతో నిరాశపరుస్తోంది. అధిక ధరలకు కొనుగోలు చేసిన కెప్టెన్ రిషబ్ పంత్, నికోలస్ పూరన్ అంచనాలు అందుకోలేకపోతున్నారు. వారి నిరాశాజనక ప్రదర్శనపై లక్నో యజమాని సంజీవ్ గోయెంకా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. రాబోయే సీజన్‌లో వారి భవిష్యత్తు ప్రశ్నార్థకమే.

LSG Vs RCB: ఆ ఇద్దరిని పీకేస్తే దరిద్రం పోద్ది.. వాళ్ల వల్ల ఏకంగా రూ. 48 కోట్ల నష్టం.. ఎవరంటే.?
Rcb Vs Lsg

Updated on: Apr 16, 2026 | 12:17 PM

ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు పరిస్థితి ఆందోళనకరంగా మారింది. బుధవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో లక్నో ఐదు వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో లక్నో కేవలం 146 పరుగులకే ఆలౌట్ అవ్వగా, విరాట్ కోహ్లీ (49) అద్భుత ప్రదర్శనతో ఆర్సీబీ కేవలం 15.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. జట్టు వరుస ఓటములతో యజమాని సంజీవ్ గోయెంకా తీవ్ర అసహనంతో ఉన్నట్లు సమాచారం. లక్నో జట్టు వైఫల్యానికి ప్రధాన కారణం భారీ ధరలు పెట్టి కొనుగోలు చేసిన రిషబ్ పంత్, నికోలస్ పూరన్ల పేలవ ప్రదర్శన అని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్లపై లక్నో ఫ్రాంచైజీ ఏకంగా రూ. 48 కోట్లు వెచ్చించింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర దక్కించుకున్న రిషబ్ పంత్ (రూ. 27 కోట్లు) కెప్టెన్‌గా, బ్యాటర్‌గా జట్టును నడిపించడంలో విఫలమవుతున్నాడు. సన్‌రైజర్స్‌పై చేసిన 68 పరుగులు మినహా మిగిలిన మ్యాచ్‌ల్లో అతను కనీసం రెండంకెల స్కోరు చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. ఆర్సీబీతో జరిగిన కీలక మ్యాచ్‌లో పంత్ కేవలం ఒక్క పరుగుకే అవుట్ అవ్వడం గమనార్హం.

ఇది చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఓయో వెళ్లినప్పుడు పోలీస్ రైడ్ జరిగితే.! ఈ ఒక్క మాట చెప్పండి మీ జోలికి రారు

మరోవైపు, రూ. 21 కోట్లకు రిటైన్ అయిన నికోలస్ పూరన్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో పూరన్ ఒక్కసారి కూడా 20 పరుగుల మార్కును దాటలేకపోయాడు. ఐదు మ్యాచ్‌లు కలిపి అతను చేసిన మొత్తం పరుగులు కేవలం 42 మాత్రమే. గత సీజన్ల ప్రదర్శనను చూసి భారీ ధర చెల్లించిన యాజమాన్యానికి, పూరన్ నుంచి కనీస మద్దతు లభించడం లేదు. ముఖ్యంగా కీలక సమయాల్లో వికెట్లు పారేసుకుంటూ జట్టును కష్టాల్లోకి నెట్టడం గోయెంకాకు ఆగ్రహం కలిగిస్తోంది. ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడంతో లక్నో పాయింట్ల పట్టికలో వెనుకబడిపోతోంది. భారీ పెట్టుబడులు పెట్టినప్పటికీ ఫలితం రాకపోవడంతో, వచ్చే సీజన్ వేలంలో వీరిని వదిలేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. రాబోయే మ్యాచ్‌ల్లోనైనా పంత్, పూరన్ ఫామ్ అందుకుని లక్నోను గెలుపు బాట పట్టించకపోతే, జట్టు మేనేజ్‌మెంట్ కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

ఇది చదవండి: ఒక బ్యాడ్ న్యూస్.. రెండు గుడ్ న్యూస్‌లు.! హైదరాబాద్ ఊపిరి పీల్చుకో.. కాటేరమ్మ కొడుకు వచ్చేస్తున్నాడు..

Follow Us