Video: క్రికెట్‌ హిస్టరీలో కొత్త షాట్.. ఏకంగా స్టాండ్ మార్చుకుని పిచ్చెక్కించాడుగా..

Glenn Phillips New Switch Cover Drive: క్రికెట్‌లో కొత్త షాట్లు పుట్టుకురావడం సహజం. అయితే, న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ తాజాగా ప్రదర్శించిన 'స్విచ్ కవర్ డ్రైవ్' ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. కెవిన్ పీటర్సన్ 'స్విచ్ హిట్' తరహాలోనే, ఈ కొత్త షాట్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.

Video: క్రికెట్‌ హిస్టరీలో కొత్త షాట్.. ఏకంగా స్టాండ్ మార్చుకుని పిచ్చెక్కించాడుగా..
Glenn Phillips New Switch Cover Drive

Updated on: Dec 31, 2025 | 1:27 PM

Glenn Phillips New Switch Cover Drive: టీ20 క్రికెట్ అంటేనే వినూత్న షాట్లకు కేరాఫ్ అడ్రస్. స్కూప్, రివర్స్ స్వీప్ వంటి షాట్లు పాతబడిపోతున్న తరుణంలో, కివీస్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ ఒక అసాధారణ షాట్‌ను పరిచయం చేశాడు. తాను రైట్ హ్యాండర్ అయినప్పటికీ, బంతి పడే లోపే లెఫ్ట్ హ్యాండర్‌గా మారి ‘క్లాసిక్ కవర్ డ్రైవ్’ కొట్టి అందరినీ అవాక్కయ్యేలా చేశాడు.

న్యూజిలాండ్‌లో జరుగుతున్న ‘సూపర్ స్మాష్’ టీ20 టోర్నీలో ఒటాగో వోల్ట్స్ తరపున ఆడుతున్న గ్లెన్ ఫిలిప్స్, సెంట్రల్ డిస్ట్రిక్ట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత విన్యాసం చేశాడు. ఆ మ్యాచ్‌లో ఆయన 48 బంతుల్లోనే 90 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అయితే, ఆయన చేసిన పరుగుల కంటే ఆయన ఆడిన తీరే చర్చనీయాంశమైంది.

ఇవి కూడా చదవండి

ఏమిటీ ‘స్విచ్ కవర్ డ్రైవ్’?

సాధారణంగా కెవిన్ పీటర్సన్ వంటి వారు ‘స్విచ్ హిట్’ ఆడేటప్పుడు లెగ్ సైడ్ లేదా లాంగ్ ఆన్ వైపు బంతిని బాదుతారు. కానీ గ్లెన్ ఫిలిప్స్ ఒక అడుగు ముందుకు వేశాడు. 19వ ఓవర్‌లో బౌలర్ బంతిని విసిరే లోపే, ఫిలిప్స్ తన బ్యాటింగ్ స్టాన్స్‌ను మార్చుకుని ఎడమచేతి వాటం బ్యాటర్‌గా మారిపోయాడు. బౌలర్ వైడ్ వేసినా, పక్కా లెఫ్ట్ హ్యాండర్ లాగా బంతిని కవర్స్ మీదుగా డ్రైవ్ చేసి ఫోర్ కొట్టాడు. ఆ తర్వాతి ఓవర్‌లో మళ్ళీ అదే పద్ధతిలో సిక్సర్ కూడా బాదాడు.

ఇది కూడా చదవండి: Virat Kohli: విరాట్ కోహ్లీ రీప్లేస్ మెంట్ వచ్చేశాడ్రోయ్.. 83 సగటుతో బడితపూజే..

పీటర్సన్ రికార్డు గుర్తుచేస్తూ..:

ఒకప్పుడు కెవిన్ పీటర్సన్ స్విచ్ హిట్‌ను పరిచయం చేసినప్పుడు క్రికెట్ నిబంధనలపై పెద్ద చర్చ జరిగింది. ఇప్పుడు ఫిలిప్స్ ఈ షాట్‌ను మరింత పదును పెట్టి ‘స్విచ్ కవర్ డ్రైవ్’గా మార్చారు. దీనికి ‘స్విచ్ కవర్ డ్రైవ్’ అని క్రీడా విశ్లేషకులు నామకరణం చేస్తున్నారు. దీనికి అద్భుతమైన ఐ-హ్యాండ్ కోఆర్డినేషన్ అవసరమని మాజీ క్రీడాకారులు ప్రశంసిస్తున్నారు.

ఫీల్డింగ్‌లోనూ సూపర్ మ్యాన్..


కేవలం బ్యాటింగ్‌లోనే కాదు, గ్లెన్ ఫిలిప్స్ ఫీల్డింగ్‌లోనూ గాలిలో తేలుతూ అద్భుతమైన క్యాచ్‌లు అందుకోవడంలో దిట్ట. అందుకే ఆయనను నేటి తరం ‘జాంటీ రోడ్స్’ అని పిలుస్తుంటారు. తాజా మ్యాచ్‌లో ఆయన ప్రదర్శించిన ఈ కొత్త షాట్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది.

రాబోయే ఐపీఎల్ 2026 సీజన్‌లో కూడా ఫిలిప్స్ ఇలాంటి వినూత్న షాట్లతో అలరిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.