సాధారణంగా అరంగేట్రం మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఏ ఆటగాడికైనా కొంచెం తడబాటు ఉంటుంది. ఎందుకంటే అతడిపై ఉండే భారీ అంచనాలు ఉంటాయి. వాటిని అందుకునే క్రమంలో కొన్నిసార్లు బ్యాట్స్‌మెన్లు తక్కువ స్కోర్‌కే పెవిలియన్ చేరుతుంటారు. అయితే కొంతమంది క్రికెటర్లు మాత్రం అనూహ్య రీతిలో చక్కటి ప్రదర్శనలు కనబరుస్తారు. అలాంటి కోవకు చెందిన ఓ క్రికెటర్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇతడి వయస్సు 18 ఏళ్లు మాత్రమే.. కానీ అరంగేట్రం మ్యాచ్‌లో దుమ్ముదులిపాడు. బౌలర్లపై సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. డెబ్యూ మ్యాచ్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించాడు. అతడెవరో కాదు రువాండా బ్యాట్స్‌మెన్ మార్టిన్ అకాయెజు.
ఘనా, రువాండా జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ జరుగుతోంది. అంతర్జాతీయ క్రికెట్‌లో మొదటి మ్యాచ్ ఆడుతున్న మార్టిన్ అకాయెజు 16 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఘనా జట్టు నిర్ణీత ఓవర్లకు ఐదు వికెట్లు నష్టపోయి 164 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ అమోలక్ సింగ్(58) అర్ధ సెంచరీతో ఆదరగొట్టగా.. జేమ్స్ వైఫా(29), శామ్సన్ ఏవియా(22) రాణించారు. ఘనా జట్టు మొత్తం ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్స్ మాత్రమే నమోదు చేసింది. రువాండా బౌలర్లలో జపి బిమెనియమన అత్యధికంగా రెండు వికెట్లు తీశాడు.
లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన రువాండా జట్టుకు.. ఓపెనర్లు డిడియర్ ఎన్బికువిమన(11), ఎరిక్ దుసింగిజిమన(34) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. అటు తుయిసెంగ్(23) రాణించగా.. కొద్దిసేపటికే వికెట్ల పతనం మొదలైంది. అయితే తన అరంగేట్రం మ్యాచ్ ఆడుతున్న అకాయెజు ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 16 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. డివిలియర్స్ మాదిరి సిక్స్ సహాయంతో ఫిఫ్టీని రీచ్ అయ్యాడు. మొత్తానికి 19 బంతుల్లో మూడు ఫోర్లు, ఆరు భారీ సిక్సర్లతో 268.4 స్ట్రైక్ రేట్‌తో 51 పరుగులు చేశాడు. రెండు బంతులు మిగిలి ఉండగానే తన జట్టుకు విజయాన్ని అందించాడు. దీనితో రువాండా జట్టు సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది.
Highest strike-rate for 50+ score on T20I debut:-
268.4 – Martin Akayezu??Rwanda v Ghana, today
234.8 – JP Kotze??Nam v Botsw, 2019
219.3 – Craig Williams??Nam v Botsw, 2019Martin Akayezu top-scored with 51(19) for Rwanda to help them defeat Ghana by 1 wicket.
— Kausthub Gudipati (@kaustats) August 18, 2021
Also Read:
ఉదయాన్నే టిఫిన్‌లో ఈ 5 ఆహార పదార్ధాలు అస్సలు తినొద్దు.. తస్మాత్ జాగ్రత్త.! అవేంటంటే..
ఈ నాలుగు రాశులవారు ప్రేమించినవారిని కష్ట సమయాల్లో ఒంటరిగా వదిలిపెట్టరు.. అందులో మీరున్నారా?