Harbhajan Singh: రెండోసారి తండ్రైన హర్భజన్ సింగ్.. మా కుటుంబం పరిపూర్ణమైంది అంటూ ట్వీట్

Harbhajan Singh: భారతీయ మాజీ క్రికెటర్ టర్బోనేటర్ హర్భజన్ సింగ్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. హర్భజన్ సింగ్ మరోసారి తండ్రి అయ్యాడు. ఆయన భార్య గీతా బస్రా...

Harbhajan Singh: రెండోసారి తండ్రైన హర్భజన్ సింగ్.. మా కుటుంబం పరిపూర్ణమైంది అంటూ ట్వీట్
Harbhajan Singh

Edited By:

Updated on: Jul 10, 2021 | 2:41 PM

Harbhajan Singh: భారతీయ మాజీ క్రికెటర్ టర్బోనేటర్ హర్భజన్ సింగ్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. హర్భజన్ సింగ్ మరోసారి తండ్రి అయ్యాడు. ఆయన భార్య గీతా బస్రా మగపిల్లాడికి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని హర్భజన్ సింగ్ తన ఇంస్టాగ్రామ్ వేదికగా తెలియజేశాడు. తన భార్య మగబిడ్డకు జన్మనిచ్చినట్లు.. తల్లి బిడ్డా క్షేమంగా తెలిపాడు. అంతేకాదు.. అందమైన సాక్స్ లను ఫోటో జతచేసి.. పిల్లాడి రాకతో తాము ఎంత సంతోషంగా ఉన్నామో సిబంలిక్ గా చెప్పకనే చెప్పాడు హర్భజన్ సింగ్.

హర్భజన్, గీత దంపతులకు ఇప్పటికే ఓ కుమార్తె ఉంది. 2016 లో ఈ దంపతులు మొదటిసారిగా తల్లిదండ్రులయ్యారు. ఆ పాపకు హీర్ ప్లాహా అనే పేరు పెట్టారు. గీతా బాలీవుడ్ లో ‘దిల్ దియా హై’, ‘ది ట్రైన్’ వంటి పలు సినిమాల్లో నటించింది. గీత, హర్భజన్ లు ప్రేమించుకుని 2015 లో పెళ్లి చేసుకున్నారు.

1980 జూలై 3 న పంజాబ్ లోని జలంధర్లో జన్మించిన హర్భజన్ సింగ్. లెగ్ స్పిన్నర్ అనిల్ కుమార్ గాయపడడంతో వెలుగులోకి వచ్చాడు. 1998లో టెస్ట్, వన్డే క్రికెట్ లో భారత జట్టులో స్థానం సంపాదించాడు. భారత దేశం తరపున ఎన్నో క్రికెట్ పోటీల్లో పాల్గొన్నాను. జట్టు విజయాలు సాధించడంలో తన పాత్రను పోషించాడు. అంతేకాదు టెస్ట్ క్రికెట్ లో హాట్రిక్ సాధించిన మొట్టమొదటి భారతీయ బౌలర్ గాను రికార్డ్ సృష్టించాడు. అయితే భారత జట్టులో చోటు కోల్పోయి ఐదేళ్లు దాటింది. అయినప్పటికీ ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదు. గత సీజన్ వరకూ ఐపీఎల్ లో చెన్నై జట్టు తరపున ఆడిన హర్భజన్ ప్రస్తుతం కేకేఆర్ తరుపున ఆడుతున్నాడు. అంతేకాదు మరోవైపు నటుడుగా వెండి అడుగు పెడుతున్నాడు. కోలీవుడ్‌లో రెండు చిత్రాల్లో నటిస్తూ నటుడిగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతున్నాడు.

Also Read: ఇదే అమ్మాయిల క్రికెట్‌లో మజా.. బౌండరీ లైన్ దగ్గర కోహ్లీ స్టైల్‌లో సూపర్బ్ క్యాచ్.!