IND vs NZ: సోషల్ మీడియా తుది జట్టును ఎంపిక చేయదు.. రాహుల్‌పై గంభీర్ కీలక వ్యాఖ్యలు

|

Oct 23, 2024 | 1:40 PM

చిన్నస్వామి స్టేడియంలో న్యూజిలాండ్‌తో మొదటి టెస్ట్ మ్యాచ్‌లో విఫలమైన టీమిండియా ప్లేయర్ కెఎల్ రాహుల్‌‌కు గౌతమ్ గంభీర్ మద్దతుగా నిలిచాడు. పూణే టెస్టులో కేఎల్ రాహుల్ మెరుగ్గా ఆడుతాడని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

IND vs NZ: సోషల్ మీడియా తుది జట్టును ఎంపిక చేయదు.. రాహుల్‌పై గంభీర్ కీలక వ్యాఖ్యలు
Gautam Gambhir On Kl Rahul Criticism
Follow us on

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన ఓపెనింగ్ టెస్ట్‌లో కేఎల్ రాహుల్ అంతగా రాణించలేదు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఫాస్ట్ బౌలర్ విలియం ఓ’రూర్కే తన వికెట్‌ను తీశాడు. దీంతో నెటింట్లో కేఎల్ రాహుల్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయంలో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కేఎల్ రాహుల్‌కు మద్దతుగా నిలిచాడు. సోషల్‌ మీడియాను తుది జట్టును ఎంపిక చేయదన్నారు. కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్‌లో నజ్ముల్ శాంటో బంగ్లాదేశ్‌పై రాహుల్ 43 బంతుల్లో 68 పరుగులు చేసినందుకు గంభీర్ ప్రశంసలు కురిపించాడు.

సోషల్ మీడియా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. టీమ్ మేనేజ్‌మెంట్, లీడర్‌షిప్ గ్రూప్ ఏమి ఆలోచిస్తుందో చాలా ముఖ్యం. అతను నిజంగా బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు, కాన్పూర్‌లో (బంగ్లాదేశ్‌పై కష్టమైన వికెట్‌లో మంచి నాక్ చేసాడు” అని గంభీర్ విలేకరుల సమావేశంలో అన్నారు. రెండో టెస్టు, పుణెలోని MCA స్టేడియంలో అక్టోబర్ 24న ప్రారంభమవుతుంది.

“అతను పెద్ద పరుగులు చేయాలి, పరుగులు సాధించగల సత్తా అతనికి ఉందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. అందుకే అతనికి జట్టు మద్దతు లభించింది.. అంతర్జాతీయ క్రికెట్ అంటే జడ్జ్ చేయడమే.”  అని గంభీర్ పేర్కొన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే ఆలౌట్ అయిన తర్వాత తొలి టెస్టులో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. సర్ఫరాజ్ ఖాన్ తొలి సెంచరీ, రిషబ్ పంత్ 99 పరుగుల స్కోరు వృథాగా పోయాయి. వర్షం కారణంగా ఒక రోజంతా ఆట నిలిచిపోయినప్పటికీ, భారత్ ఓటమిని తప్పించుకోలేకపోయింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..