Gautam Gambir: వికెట్లు తీయడంలో అతను నిపుణుడు.. గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

|

Jan 29, 2022 | 3:21 PM

IPL 2022 కొత్తగా ఉండబోతుంది. ఈసారి 8 జట్లకు బదులుగా 10 జట్లు లీగ్‌లో పాల్గొనబోతున్నాయి. పాత ఎనిమిది జట్లతో పాటు లక్నో సూపర్ జెయింట్స్(lucknow super giants), అహ్మదాబాద్ జట్లు తొలిసారి లీగ్‌లో పాల్గొనబోతున్నాయి...

Gautam Gambir: వికెట్లు తీయడంలో అతను నిపుణుడు.. గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Gambir
Follow us on

IPL 2022 కొత్తగా ఉండబోతుంది. ఈసారి 8 జట్లకు బదులుగా 10 జట్లు లీగ్‌లో పాల్గొనబోతున్నాయి. పాత ఎనిమిది జట్లతో పాటు లక్నో సూపర్ జెయింట్స్(lucknow super giants), అహ్మదాబాద్ జట్లు తొలిసారి లీగ్‌లో పాల్గొనబోతున్నాయి. లక్నో జట్టు కెప్టెన్, కోచ్‌ పేరును ప్రకటించింది. భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్(gautam gambhir) జట్టుకు మెంటార్‌గా నియమితులయ్యారు. మెగా వేలాని(ipl 2022 mega auction)కి ముందు, రెండు కొత్త జట్లు ముగ్గురు ఆటగాళ్లను ఎంచుకోవాల్సి వచ్చింది.

లక్నో తమ జట్టు కేఎల్ రాహుల్, మార్కస్ స్టోయినిస్, రవి బిష్ణోయ్‌లను తీసుకుంది. కేఎల్‌ రాహుల్‌ను జట్టు కెప్టెన్‌గా నియమించింది. ఆండీ ఫ్లవర్‌ ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నారు. తనను తాను నిరూపించుకోవడానికి జట్టుకు గొప్ప అవకాశం ఉందని గంభీర్ అభిప్రాయపడ్డాడు.

గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ ‘సంజీవ్ గోయెంకా సర్ చివరిసారి పూణే జట్టును కొనుగోలు చేశాడు. అతను ఐపీఎల్ గెలవడానికి కేవలం 1 పరుగు దూరంలో ఉన్నాడు. ఇప్పుడు ఆ లోటును ఈసారి పూరించే అవకాశం వచ్చింది.’ అని చెప్పాడు. ఇటీవలే పేరు తెచ్చుకున్న యువ బౌలర్ రవి బిష్ణోయ్‌ని కూడా లక్నో జట్టు చేర్చుకుంది. రవి బిష్ణోయ్ గురించి గంభీర్ మాట్లాడుతూ, ‘రవి బిష్ణోయ్ యువకుడు, వికెట్లు తీయడంలో నిపుణుడు.’ అని పేర్కొన్నాడు.

Read Also.. Watch Video: ఇలా బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేయడం తప్పు.. ఆగ్రహం వ్యక్తం చేసిన యువరాజ్ సింగ్.. వైరల్ వీడియో