AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు కొట్టిన విధ్వంసకర బ్యాటర్లు.. లిస్టులో టాప్ ధోని ఫ్రెండ్ కాని ఫ్రెండ్..

క్రికెట్ చరిత్రలో ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు కొట్టడం అరుదైన ఘనత. యువరాజ్ సింగ్, హర్షెల్ గిబ్స్ లాంటి అంతర్జాతీయ దిగ్గజాలతో పాటు సర్ గ్యారీ సోబర్స్, రవిశాస్త్రి, హజరతుల్లా జజాయ్ వంటి ఆటగాళ్లు ఈ రికార్డును సాధించారు. వారి పవర్, టైమింగ్, విధ్వంసకర బ్యాటింగ్‌కు ఈ ఫీట్ నిదర్శనం.

ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు కొట్టిన విధ్వంసకర బ్యాటర్లు.. లిస్టులో టాప్ ధోని ఫ్రెండ్ కాని ఫ్రెండ్..
Odi Cricket
Ravi Kiran
|

Updated on: Apr 03, 2026 | 2:00 PM

Share

క్రికెట్ చరిత్రలో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టడం అనేది అత్యంత అరుదైన, ఆశ్చర్యకరమైన ఘనత. ఈ ఫీట్ బ్యాట్స్‌మెన్ల పవర్, టైమింగ్, ఫియర్‌లెస్ బ్యాటింగ్‌కు నిదర్శనం. ఈ అద్భుతాన్ని సాధించిన అతి కొద్దిమంది ఆటగాళ్లలో ఐదుగురు స్టార్ ప్లేయర్స్ ఉన్నారు. వారి ప్రదర్శనలు క్రికెట్ చరిత్రలో ఓ అరుదైన ఘనతలు అని చెప్పవచ్చు.

హజరతుల్లా జజాయ్:

2018 అఫ్ఘానిస్తాన్ ప్రీమియర్ లీగ్‌లో కాబుల్ జవాన్ తరఫున ఆడిన హజరతుల్లా జజాయ్, అబ్దుల్లా మజారి బౌలింగ్‌లో ఆరు సిక్సర్లు కొట్టి ఈ జాబితాలో చేరాడు. ఈ మ్యాచ్‌లో అతను కేవలం 12 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించి, టీ20 క్రికెట్‌లో యువరాజ్ సింగ్, క్రిస్ గేల్ సరసన నిలిచాడు.

సర్ గ్యారీ సోబర్స్:

వెస్టిండీస్ దిగ్గజం సర్ గ్యారీ సోబర్స్ 1968లోనే ఈ అద్భుతం సృష్టించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఆరు సిక్సర్లు కొట్టిన మొట్టమొదటి బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు. నాటింగ్‌హామ్‌షైర్ కెప్టెన్‌గా గ్లామోర్గాన్‌కు చెందిన మాల్కమ్ నాష్ బౌలింగ్‌లో అతడు వరుసగా ఆరు సిక్సర్లు కొట్టి చరిత్ర సృష్టించాడు.

రవిశాస్త్రి:

టీమిండియా మాజీ క్రికెటర్ రవిశాస్త్రి 1984 రంజీ ట్రోఫీలో ముంబై తరఫున బరోడా బౌలర్ తిలక్ రాజ్ బౌలింగ్‌లో ఆరు సిక్సర్లు కొట్టి సోబర్స్ రికార్డును బద్దలుకొట్టాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన మొదటి భారతీయుడిగా రవిశాస్త్రి నిలిచాడు.

హర్షెల్ గిబ్స్:

అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన మొదటి బ్యాట్స్‌మెన్ దక్షిణాఫ్రికాకు చెందిన హర్షెల్ గిబ్స్. 2007 వన్డే ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డాన్ వాన్ బౌలింగ్‌లో అతను ఈ ఫీట్‌ను సాధించాడు. అప్పటివరకు దేశీయ క్రికెట్‌కు పరిమితమైన ఈ ఘనతను అంతర్జాతీయ వేదికపై పరిచయం చేసి బౌలర్లకు దడ పుట్టించాడు.

యువరాజ్ సింగ్:

అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన రెండో బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్. 2007లో జరిగిన మొదటి టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌పై స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువరాజ్ ఆరు సిక్సర్లు కొట్టాడు. ఆండ్రూ ఫ్లింటాఫ్ నోటి దురుసు కారణంగా బ్రాడ్ బలయ్యాడు. ఈ మ్యాచ్‌లో యువరాజ్ కేవలం 12 బంతుల్లో అర్ధ సెంచరీ చేసి అంతర్జాతీయ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ టీ20 హాఫ్ సెంచరీ రికార్డును నెలకొల్పాడు. అది ఇప్పటికీ చెక్కుచెదరలేదు. ఈ ఐదుగురు ఆటగాళ్లు తమ అద్భుతమైన ప్రదర్శనలతో క్రికెట్ చరిత్రలో నిలిచిపోయారు. టెస్ట్ క్రికెట్‌లో మాత్రం ఇప్పటివరకు ఎవరూ ఈ ఘనతను సాధించలేదు.

ఇది చదవండి: టెస్ట్ క్రికెట్‌ను వన్డేల్లా ఆడిన మొనగాళ్లు వీరే.. లిస్టులో నెంబర్‌వన్ టీమిండియా కింగ్

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!