Independence Day 2023: టీమిండియా ఆటగాళ్ల సెలబ్రేషన్స్.. మువ్వన్నెల జెండాతో సోషల్ మీడియాలో సందడి..

గత 75 ఏళ్లలో క్రీడల్లో భారత్ ఎంతో ప్రగతి సాధించింది. ముఖ్యంగా క్రికెట్‌లో సాధించిన విజయాలు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. 1983లో కపిల్-దేవ్ నేతృత్వంలోని భారత జట్టు తొలిసారి ప్రపంచకప్‌ను గెలుచుకుంది. లక్షలాది మంది ప్రజలు ఆటను అనుసరించడం ప్రారంభించారు. భారత క్రికెట్ గమనాన్ని శాశ్వతంగా మార్చారు.

Independence Day 2023: టీమిండియా ఆటగాళ్ల సెలబ్రేషన్స్.. మువ్వన్నెల జెండాతో సోషల్ మీడియాలో సందడి..
Independence Day

Updated on: Aug 15, 2023 | 12:03 PM

నేటికి, భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 సంవత్సరాలు (Independence Day 2023) పూర్తయింది. దేశమంతా ఈ వేడుకలో మునిగిపోయింది. భారత ఆటగాళ్లు కూడా ఈ రోజును తమదైన శైలిలో సెలబ్రేట్ చేసుకున్నారు. విరాట్ కోహ్లీ నుంచి జెమీమా రోడ్రిగ్స్ వరకు, భారత క్రీడాకారులు ఆగస్టు 15 న స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. చాలా మంది భారతీయ క్రీడాకారులు 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని సోషల్ మీడియాలో తమ ప్రొఫైల్ ఫోటోలను మార్చడం ద్వారా శుభకాంక్షలు తెలిపారు.

సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, రవీంద్ర జడేజా, కపిల్ దేవ్, ఇర్ఫాన్ పఠాన్, అనేక ఇతర ప్రముఖ క్రికెటర్లు భారతదేశానికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసేందుకు సోషల్ మీడియాలోకి వచ్చారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన ప్రొఫైల్ ఫొటోను త్రివర్ణ పతాకంగా మార్చారు. చేతిలో త్రివర్ణ పతాకాన్ని పట్టుకున్న ఫొటోను రవీంద్ర జడేజా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. చెతేశ్వర్ పుజారా కూడా శుభాకాంక్షలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రముఖ ఆటగాళ్ల శుభాకాంక్షలు..

గత 75 ఏళ్లలో క్రీడల్లో భారత్ సాధించిన ప్రగతి ఒక బరువు అయితే.. క్రికెట్‌లో సాధించిన విజయాలు మరో బరువుగా చెప్పుకోవచ్చు. 1983లో కపిల్-దేవ్ నేతృత్వంలోని భారత జట్టు తొలిసారి ప్రపంచకప్‌ను గెలుచుకుంది. లక్షలాది మంది ప్రజలు ఆటను అనుసరించడం ప్రారంభించారు. భారత క్రికెట్ గమనాన్ని శాశ్వతంగా మార్చారు.

1989లో సచిన్ రమేష్ టెండూల్కర్, 16 ఏళ్ల యుక్తవయస్సులో క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. అతను నేటి గొప్ప బ్యాట్స్‌మెన్‌లలో ఒకడు. 2007లో మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని యువ భారత జట్టు టీ20 ప్రపంచ కప్ ప్రారంభ ఎడిషన్‌ను గెలుచుకుంది. ఇది 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ పుట్టుకకు దారితీసింది.

28 ఏళ్ల తర్వాత 2011లో ఎంఎస్ ధోనీ నేతృత్వంలోని భారత్ కోట్లాది మంది అభిమానుల కలను నెరవేర్చింది. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ను భారత్ రెండోసారి గెలుచుకుంది. ఈసారి ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ 2023లో జరుగుతాయి. ఇది ప్రారంభానికి కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. 2013 నుంచి ఇప్పటి వరకు ఎలాంటి భారీ ట్రోఫీని గెలవని భారత్ ఈసారి రోహిత్ శర్మ సారథ్యంలో వన్డే ప్రపంచకప్ గెలుస్తుందో లేదో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..