IPL 2025: టైలర్ కొడుకుగా పుట్టి డెబ్యూలోనే నాటు పర్ఫార్మెన్స్! ఎవరీ SRH నయా వెపన్ జీషన్ అన్సారీ?

SRH యువ బౌలర్ జీషన్ అన్సారీ తన తొలి మ్యాచ్‌లోనే 3 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. తండ్రి ఓ సాధారణ టైలర్ అయినా, తన పట్టుదలతో క్రికెట్‌లో రాణించి IPL స్థాయికి చేరుకున్నాడు. SRH బౌలింగ్ విభాగం ఈ సీజన్‌లో దెబ్బతిన్నప్పటికీ, జీషన్ లాంటి యువ ఆటగాళ్లు భవిష్యత్తులో కీలకంగా మారవచ్చని ఆశలు పెరుగుతున్నాయి. SRH మేనేజ్‌మెంట్ అతనికి మరిన్ని అవకాశాలు ఇస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

IPL 2025: టైలర్ కొడుకుగా పుట్టి డెబ్యూలోనే నాటు పర్ఫార్మెన్స్! ఎవరీ SRH నయా వెపన్ జీషన్ అన్సారీ?
Zeeshan Ansari Srh

Updated on: Mar 31, 2025 | 7:59 PM

సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మరో ఓటమిని చవిచూసింది. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా, వైజాగ్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) చేతిలో SRH 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. బ్యాటింగ్ విభాగంలో మరోసారి SRH నిరాశపరిచినా, ఈ మ్యాచ్‌లో జీషన్ అన్సారీ, అనికేత్ వర్మ ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. యువ ఆటగాడు అనికేత్ వర్మ (74 పరుగులు, 41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సులు) జట్టును ఆదుకునే ప్రయత్నం చేయగా, జీషన్ అన్సారీ (3/42) SRH బౌలింగ్‌లో మెరిశాడు. ముఖ్యంగా జీషన్ తన తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకుని, SRH భవిష్యత్తు బౌలింగ్ అస్త్రంగా మారతాడనే అభిప్రాయాన్ని అందరిలో కలిగించాడు.

ఎవరీ జీషన్ అన్సారీ?

జీషన్ అన్సారీ ఒక లెగ్ స్పిన్నర్, దేశవాళీ క్రికెట్‌లో ఉత్తర ప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతను ఇప్పటివరకు 5 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 1 టీ20 మ్యాచ్ ఆడి, 17 వికెట్లు తీశాడు.

ఐపీఎల్ 2025 మెగా వేలంలో, SRH అతన్ని రూ. 30 లక్షలకి కొనుగోలు చేసింది. 2016 అండర్-19 ప్రపంచకప్‌లో భారత అండర్-19 జట్టులో సభ్యుడిగా కూడా ఉన్నాడు. ఆ టోర్నీలో అతనికి రెండు మ్యాచులు ఆడే అవకాశం లభించింది, అందులో 35 పరుగులు చేశాడు. SRH ఇన్‌ట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచుల్లోనూ తన టాలెంట్ ప్రూవ్ చేశాడు, అందుకే మ్యాచ్ ఫిట్‌గా ఉన్న అతనిని తుది జట్టులోకి తీసుకున్నారు.

SRH టాప్ బౌలర్లు విఫలమైన సమయంలో, జీషన్ అన్సారీ తన బౌలింగ్‌తో నయా హోప్‌గా నిలిచాడు. మొదట్లో అతని పేరు పెద్దగా తెలియకపోయినా, ఈ మ్యాచ్‌లో 3 కీలక వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. SRH మేనేజ్‌మెంట్ తదుపరి మ్యాచుల్లో అతనికి మరిన్ని అవకాశాలు ఇస్తుందా? లేదా వెటరన్ బౌలర్లపైే నమ్మకం ఉంచుతుందా? అనేది చూడాలి.

టైలర్ కొడుకు నుంచి స్టార్ క్రికెటర్‌గా..

జీషన్ అన్సారీ లక్నోకు చెందిన దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. అతని తండ్రి ఓ సాధారణ టైలర్. లక్నోలో చిన్న టైలర్ షాప్ నడుపుతూ, 19 మంది సభ్యులతో ఉన్న ఉమ్మడి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన కన్నయ్య లాల్ అతనిలోని టాలెంట్‌ను గుర్తించి, క్రికెట్‌ వైపు ప్రోత్సహించాడు. 10 ఏళ్ల వయస్సులోనే క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న జీషన్, తండ్రి సహాయంతో క్రికెట్‌లో మెళకువలు నేర్చుకున్నాడు.

అతని కుటుంబ పరిస్థితులు తీవ్రంగా ఉన్నా, పట్టుదలతో ముందుకు సాగుతూ, IPL స్థాయికి ఎదిగాడు. ఇప్పుడు SRH బౌలింగ్‌ లైనప్‌లో తన స్థానం నిలబెట్టుకోవడానికి కఠినంగా శ్రమిస్తున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..