Test Cricket: టెస్టు క్రికెట్‌లో తోపులు వీరే.. టాప్ 5 లిస్టులో ఇద్దరు మనోళ్లే..

|

Aug 22, 2024 | 1:27 PM

5 Batters Most Runs In Test Cricket: ప్రస్తుతం అభిమానులు క్రికెట్‌లో టెస్ట్ మ్యాచ్‌ల సీజన్‌ను చూడబోతున్నారు. ఒకవైపు పాకిస్థాన్ , బంగ్లాదేశ్ మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కాగా, మరోవైపు ఇంగ్లండ్, శ్రీలంక మధ్య టెస్టు సిరీస్ కూడా ప్రారంభమైంది. టీమిండియా కూడా వచ్చే నెల నుంచి బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ఆడనుంది.

Test Cricket: టెస్టు క్రికెట్‌లో తోపులు వీరే.. టాప్ 5 లిస్టులో ఇద్దరు మనోళ్లే..
Team India
Follow us on

5 Batters Most Runs In Test Cricket: ప్రస్తుతం అభిమానులు క్రికెట్‌లో టెస్ట్ మ్యాచ్‌ల సీజన్‌ను చూడబోతున్నారు. ఒకవైపు పాకిస్థాన్ , బంగ్లాదేశ్ మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కాగా, మరోవైపు ఇంగ్లండ్, శ్రీలంక మధ్య టెస్టు సిరీస్ కూడా ప్రారంభమైంది. టీమిండియా కూడా వచ్చే నెల నుంచి బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ఆడనుంది.

అయితే, అసలు టెస్ట్ క్రికెట్‌ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ప్రపంచంలోని ఐదుగురు బ్యాట్స్‌మెన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. కాగా, ఈ జాబితాలో ఇద్దరు భారత వెటరన్ ఆటగాళ్లు కూడా ఉన్నారు.

5. అలిస్టర్ కుక్ (ఇంగ్లండ్)..

ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ అలిస్టర్‌ కుక్‌ టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. తన క్రికెట్ కెరీర్‌లో మొత్తం 161 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 291 ఇన్నింగ్స్‌లలో కుక్ 12472 పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతని బ్యాట్‌ నుంచి 33 సెంచరీలు, 57 అర్ధ సెంచరీలు నమోదయ్యాయి.

4. రాహుల్ ద్రవిడ్..

టీమిండియా మాజీ కెప్టెన్, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ టెస్టు క్రికెట్‌లోని గొప్ప ఆటగాళ్లలో ఒకరు. భారత్ తరపున 164 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ద్రవిడ్ 286 ఇన్నింగ్స్‌ల్లో 13288 పరుగులు చేశాడు. ఇందులో ద్రవిడ్ 36 సెంచరీలు, 63 హాఫ్ సెంచరీలు చేశాడు.

3. జాక్వెస్ కల్లిస్..

దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాక్వెస్ కల్లిస్ 1995 నుంచి 2013 వరకు తన దేశం తరపున క్రికెట్ ఆడాడు. ఈ కాలంలో, కలిస్ 166 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 288 ఇన్నింగ్స్‌లలో 13289 పరుగులు చేశాడు. ఈ సమయంలో, కల్లిస్ బ్యాట్ నుంచి 45 సెంచరీలు, 58 అర్ధ సెంచరీలు నమోదయ్యాయి.

2. రికీ పాంటింగ్..

ఆస్ట్రేలియా అత్యంత విజయవంతమైన కెప్టెన్ రికీ పాంటింగ్ తన దేశం కోసం 1995 నుంచి 2012 వరకు క్రికెట్ ఆడాడు. ఈ కాలంలో, పాంటింగ్ 168 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. అందులో 287 ఇన్నింగ్స్‌లలో అతని పేరు మీద 13378 పరుగులు నమోదయ్యాయి. ఇందులో అతని అత్యధిక స్కోరు 257 పరుగులు. ఈ కాలంలో, పాంటింగ్ 41 సెంచరీలు, 62 అర్ధ సెంచరీలు చేశాడు.

1. సచిన్ టెండూల్కర్..

టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా టీమిండియా గ్రేట్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ రికార్డు సృష్టించాడు. తన కెరీర్‌లో 200 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 329 ఇన్నింగ్స్‌ల్లో 15921 పరుగులు చేశారు. ఈ సమయంలో సచిన్ 51 సెంచరీలు, 68 హాఫ్ సెంచరీలు సాధించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..