Cricket Bats : ఆ భారీ సిక్సర్ల వెనుక అసలు కిటుకు ఇదే.. ధోనీ, కోహ్లీ, రోహిత్ వాడే బ్యాట్ల సీక్రెట్లు మీకు తెలుసా?

Cricket Bats : మహేంద్ర సింగ్ ధోనీ బ్యాట్ల విషయంలో చాలా క్లారిటీగా ఉంటారు. సాధారణంగా ఆయన రెండు రకాల బరువులున్న బ్యాట్లను వాడతారు. ఇన్నింగ్స్ ఆరంభంలో సాధారణ బ్యాట్ వాడినా, చివరి ఓవర్లలో సిక్సర్లు బాదాల్సి వచ్చినప్పుడు మాత్రం బరువైన బ్యాట్‌ను తీసుకుంటారు.

Cricket Bats : ఆ భారీ సిక్సర్ల వెనుక అసలు కిటుకు ఇదే.. ధోనీ, కోహ్లీ, రోహిత్ వాడే బ్యాట్ల సీక్రెట్లు మీకు తెలుసా?
Cricket Bats

Updated on: Apr 25, 2026 | 11:17 AM

Cricket Bats : క్రికెట్ మైదానంలో సిక్సర్ల వర్షం కురవాలంటే కేవలం ఆటగాడి కండబలం ఉంటే సరిపోదు, ఆ బంతిని బాదే బ్యాట్ కూడా అంతే పవర్‌ఫుల్‌గా ఉండాలి. అందుకే టీమిండియా స్టార్లు తమ బ్యాట్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. బ్యాట్ బరువు ఎంత ఉండాలి? స్వీట్ స్పాట్ ఎక్కడ ఉండాలి? హ్యాండిల్ ఎలా ఉండాలి? ఇలా ప్రతి చిన్న విషయాన్ని దగ్గరుండి చూసుకుంటారు. అందుకే మేటి ఆటగాళ్ల సిక్సర్ల వెనుక ఉన్న ఆ బ్యాట్ రహస్యాలేంటో చూద్దాం.

ధోనీ మార్క్ స్టైల్

మహేంద్ర సింగ్ ధోనీ బ్యాట్ల విషయంలో చాలా క్లారిటీగా ఉంటారు. సాధారణంగా ఆయన రెండు రకాల బరువులున్న బ్యాట్లను వాడతారు. ఇన్నింగ్స్ ఆరంభంలో సాధారణ బ్యాట్ వాడినా, చివరి ఓవర్లలో సిక్సర్లు బాదాల్సి వచ్చినప్పుడు మాత్రం బరువైన బ్యాట్‌ను తీసుకుంటారు. ఈ బ్యాట్ మధ్య భాగంలో అదనంగా 30 గ్రాముల బరువు ఉండేలా చూసుకుంటారు. దీనివల్ల బంతి బ్యాట్‌కు తగిలినప్పుడు వచ్చే పవర్ ఎక్కువగా ఉంటుంది, అది నేరుగా స్టేడియం బయట పడుతుంది.

హార్దిక్ పాండ్యా కర్వ్ సీక్రెట్

హార్దిక్ పాండ్యా వాడే బ్యాట్ చాలా విభిన్నంగా ఉంటుంది. దీనికి హ్యాండిల్ నుంచి కింద వరకు ఒక రకమైన వంపు ఉంటుంది. ఈ కర్వ్ వల్ల బంతిని కొట్టినప్పుడు అది పారాబోలా ఆకారంలో గాల్లోకి లేచి దూరంగా వెళ్తుంది. అలాగే కింద భాగం రౌండ్‌గా ఉండటం వల్ల యార్కర్లను డిగ్ అవుట్ చేయడం సులభమవుతుంది. ఇక సూర్యకుమార్ యాదవ్ విషయానికొస్తే, ఆయనకు వైడ్ గ్రైన్స్ అంటే బ్యాట్ మీద గీతలు వెడల్పుగా ఉండే విల్లోలంటే ఇష్టం. ఇవి బంతికి మంచి రీబౌండ్‌ను ఇస్తాయి.

కోహ్లీ, రోహిత్ బ్యాట్ ముచ్చట్లు

విరాట్ కోహ్లీ బ్యాట్ బరువు 1,175 గ్రాములు. ఆయన ఎక్కువగా స్వీప్ షాట్లు ఆడరు కాబట్టి, గ్రౌండ్ ముందు భాగంలో ఆడేందుకు వీలుగా బ్యాట్ బ్యాలెన్స్‌ను చూసుకుంటారు. ఇక రోహిత్ శర్మ బ్యాట్ కోహ్లీ కంటే కొంచెం బరువుగా (1,180 గ్రాములు) ఉంటుంది. రోహిత్ తన బ్యాట్ తయారీదారులకు చాలా స్పష్టమైన సూచనలు ఇస్తారు. తనకు మంచి స్వింగ్, రీబౌండ్ వచ్చే బ్యాట్లు కావాలని కోరుకుంటారు.

యువ ఆటగాళ్ల అభిరుచులు

శివమ్ దూబే ఇటీవలే టీ20 వరల్డ్ కప్ కోసం తన బ్యాట్ బరువును పెంచారు. బ్యాట్ మధ్యలో ఉబ్బెత్తుగా ఉండటం వల్ల ఆయనకు క్లీన్ హిట్టింగ్ సాధ్యమవుతోంది. అభిషేక్ శర్మ బ్యాట్ స్వీట్ స్పాట్ కింద భాగంలో ఉంటుంది, ఇది ఆయన దూరం నుంచి వచ్చే బంతులను సిక్సర్లుగా మలచడంలో తోడ్పడుతుంది. ఇషాన్ కిషన్ మాత్రం అందరికంటే తేలికైన బ్యాట్ (1,125 గ్రాములు) వాడుతూ, ఒక కత్తిలా దాన్ని తిప్పుతూ ఫోర్లు, సిక్సర్లు బాదుతుంటారు. సంజూ శాంసన్ బ్యాట్ పింగ్ (బంతి తగిలినప్పుడు వచ్చే శబ్దం) విషయంలో చాలా పర్టిక్యులర్‌గా ఉంటారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us