30 సంవత్సరాల వయస్సులో చాలామంది క్రికెటర్లు పదవీ విరమణ మార్గంలో పయణిస్తుంటారు. కానీ, ఈ వయస్సులో కొంతమంది ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెడుతుంటారు. అలాంటి వారిలో సయీద్ అజ్మల్ ఒకరు. పాకిస్థాన్‌కు చెందిన ఈ మాజీ క్రికెటర్ పుట్టినరోజు ఈనాడు. సయీద్ ఆఫ్-స్పిన్ బౌలింగ్ చేసేవాడు. ఇందులో ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన రెండో బౌలర్‌గా ఎదిగాడు. అయితే ఈ బంతి కారణంగా, సయూద్ చాలా వివాదాలలో కూడా చిక్కున్నాడు. అలాగే నిషేధాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. సచిన్ టెండూల్కర్ తన చివరి వన్డేలో సయీద్ అజ్మల్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. అతని కెరీర్ ఎక్కువ కాలం మాత్రం సాగలేదు. కేవలం కొద్ది కాలంలోనే ఎన్నో రికార్డులు నెలకొల్పిన సయూద్.. నంబర్ వన్ ర్యాంకింగ్‌కు కూడా చేరుకున్నాడు.
సయీద్ అజ్మల్ 2008 లో భారత్‌తో జరిగిన ఆసియా కప్ మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో అతనికి ఒక వికెట్ మాత్రమే లభించింది. కానీ, ఒక సంవత్సరం తరువాత 2009 లో అతను తన బంతితో ఆస్ట్రేలియాను చాలా ఇబ్బంది పెట్టాడు. అతని బంతిని ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్‌లు అర్థం చేసుకోలేకపోయారు. ఈ సిరీస్ తర్వాత ఐసీసీ సయీద్ అజ్మల్‌ని విచారించింది. ఇందులో అతని బౌలింగ్ యాక్షన్ సరైనదని తేలింది. సయీద్ అజ్మల్ 2009 టీ 20 వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్ జట్టుకు తిరిగి వచ్చాడు. మొత్తం 13 వికెట్లు తీసుకున్నాడు. టోర్నమెంట్‌లో వికెట్లు తీయడంలో ఉమ్మడిగా రెండవ స్థానంలో నిలిచాడు. ఈ అద్భుతమైన ప్రదర్శనతో పాకిస్తాన్ టోర్నమెంట్ విజేతగా నిలిచింది.
టీ 20 వరల్డ్ కప్ గెలిచిన కొన్ని నెలల తర్వాత సయూద్ శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తన టెస్ట్ అరంగేట్రం చేసి 14 వికెట్లు తీసుకున్నాడు. అప్పుడు అతను మూడు ఫార్మాట్లలో పాకిస్తాన్ ప్రధాన బౌలర్‌గా మారాడు. 2011 వచ్చే సమయానికి, సయీద్ అజ్మల్ బంతుల్లోని మ్యాజిక్ ప్రపంచాన్ని భయపెట్టడం మొదలైంది. ఈ సమయంలో అతను యూఏఈలో శ్రీలంకపై 18, తరువాత శ్రీలంకలో 15, యూఏఈలో ఇంగ్లండ్‌పై 24 వికెట్లు తీశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో అతను థర్డ్ అనే కొత్త బంతిని కనుగొన్నట్లు పేర్కొన్నాడు. అయితే తరువాత అలాంటి బంతి లేదని పేర్కొన్నాడు.
2011 లో సయీద్ అజ్మల్ టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన వ్యక్తిగా నిలిచాడు. అతను ఎనిమిది మ్యాచ్‌లలో 50 వికెట్లు తీశాడు. ఈ ఆట తర్వాత, అతను ఐసీసీ ర్యాంకింగ్స్‌లో చేరాడు. వన్డేలో నంబర్ వన్ బౌలర్ అయ్యాడు. తర్వాత టీ 20, టెస్ట్‌లో టాప్ -10 లో చేరాడు. సయూద్ 35 టెస్టుల్లో 178 వికెట్లు, 113 వన్డేల్లో 184, 64 టీ 20 ల్లో 85 వికెట్లు తీశాడు. ఒకానొక సమయంలో టీ 20 ల్లో అత్యధిక వికెట్లు తీసిన వ్యక్తిగా నిలిచాడు. మిస్బా-ఉల్-హక్ కెప్టెన్సీలో అతను అనేక విజయాలను సాధించాడు.
2014 లో సయీద్ అజ్మల్ బౌలింగ్ యాక్షన్ మరోసారి పరిశీలనకులోనైంది. ఇందులో అతని రెండవ బంతి చట్టవిరుద్ధంగా తేలింది. ఐసీసీ అతడిని నిషేధించింది. తరువాత, సక్లైన్ ముస్తాక్ సహాయంతో అతను తన బౌలింగ్ చర్యను మెరుగుపరుచుకున్నాడు. అనంతరం మరలా అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి వచ్చాడు. కానీ, అంతకు ముందులా మాత్రం అతని కెరీర్ సాగలేదు. తిరిగి వచ్చాక మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. సయీద్ అజ్మల్ 2017 లో క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. ప్రస్తుతం అతను కోచింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు.
Watch Video: ఒక్క క్యాచ్ కోసం పరిగెత్తిన ముగ్గురు ఫీల్డర్స్.. చివర్లో ట్విస్ట్ మాములుగా లేదు.!