Chris Cairns: న్యూజిలాండ్ లెజెండరీ ఆల్ రౌండర్ క్రిస్ కెయిర్న్స్ ఆరోగ్యం బాగా దెబ్బతింది. గుండె శస్త్రచికిత్స తర్వాత అతని కాళ్ళకు పక్షవాతం వచ్చింది. ఇదే సమయంలో అతని వెన్నుముక కూడా బాగా దెబ్బతింది. కైర్న్స్ దీర్ఘకాలంగా తీవ్రమైన గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. ఆగస్టు 11 న అకస్మాత్తుగా మూర్ఛపోయిన తరువాత సిడ్నీ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. అతనికి సిడ్నీలో గుండె ఆపరేషన్ జరిగింది. అతను వారం క్రితం లైఫ్ సపోర్ట్ సిస్టమ్ నుంచి బయటకు వచ్చాడు.
న్యూజిలాండ్ మీడియా నివేదికల ప్రకారం, కెయిర్న్స్ కాన్బెర్రాకు తిరిగి చేరుకున్నాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. మాజీ ఆల్ రౌండర్ న్యాయవాది ఆరోన్ లాయిడ్ ప్రకారం, సిడ్నీలో గుండె శస్త్రచికిత్స సమయంలో అతడి వెన్నుముక దెబ్బతింది . దీంతో అతని కాళ్లు పక్షవాతానికి గురయ్యాయి. ఆస్ట్రేలియాలో స్పెషలిస్ట్ అతనికి వెన్నెముక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారి వివరాల ప్రకారం, కెయిర్న్స్ కుటుంబం ప్రస్తుతం అతనితో ఎక్కువ సమయం కలిసి గడపాలని కోరుకుంటుంది. ప్రజల నుంచి మద్దతు లభిస్తున్నందుకు ఆ కుటుంబం కృతజ్ఞతను తెలియజేసింది.
క్రిస్ కైర్న్స్ న్యూజిలాండ్ తరఫున ఎన్నో అద్భుతమైన మ్యాచ్లు ఆడాడు. కెయిర్న్స్ 62 టెస్టు మ్యాచ్‌లలో 3,320 పరుగులతో 218 వికెట్లు తీశాడు. అదేవిధంగా, అతను 215 వన్డేల్లో 4,950 పరుగులతో పాటు 201 వికెట్లు తీసుకున్నాడు. అతను రెండు T20I మ్యాచ్‌లు కూడా ఆడాడు. ఇందులో అతను 3 పరుగులు చేసి ఒక వికెట్ కూడా తీసుకున్నాడు.
క్రిస్ కెయిర్న్స్ పేరు ఫిక్సింగ్‌లో వచ్చింది. క్రిస్ కెయిర్న్స్ కెరీర్ కూడా వివాదాలతో ముడిపడి ఉంది. 2008 సంవత్సరంలో, ఇండియన్ క్రికెట్ లీగ్ (ICL) లో ఆడుతున్నప్పుడు, అతని పేరు ఫిక్సింగ్‌లో వినిపించింది. తమపై వచ్చిన ఆరోపణలు తప్పని నిరూపించడానికి కెయిర్న్స్ న్యాయ పోరాటం కూడా చేశాడు. అయితే, ICL తరువాత రద్దు అయిన సంగతి తెలిసిందే. 2012 లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) వ్యవస్థాపకుడు లలిత్ మోడీపై పరువు నష్టం కేసు వేసి గెలిచాడు.
Also Read:
24 బంతులు.. 3 పరుగులు.. 7 వికెట్లు..! ప్రపంచ రికార్డుతో బ్యాటర్లను భయపెట్టిన మహిళా బౌలర్..!
IPL 2021: ఐపీఎల్ 2021 సెకండాఫ్‌కి కొత్త జోష్.. 9 మంది ప్లేయర్లు అరంగేట్రం.. వారెవరంటే?