Anil kumble Meets YS Jagan: ముఖ్యమంత్రి జగన్ తో మాజీ క్రికెటర్ అనిల్‌కుంబ్లే భేటీ..!

|

Jul 05, 2021 | 6:58 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను సోమవారం నాడు టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు సీఎం జగన్.. అనిల్ కుంబ్లేను సాదరంగా పుష్పగుచ్ఛంతో ఆహ్వానించి కొద్దిసేపు మాట్లాడారు.

Anil kumble Meets YS Jagan: ముఖ్యమంత్రి జగన్ తో మాజీ క్రికెటర్ అనిల్‌కుంబ్లే భేటీ..!
అలాగే సీఎం జగన్ కూడా అనిల్ కుంబ్లేను శాలువాతో సత్కరించి, తిరుమల తిరుపతి శ్రీనివాసుడి విగ్రహాన్ని బహూకరించారు.
Follow us on

Anil kumble Meets YS Jagan: అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను సోమవారం నాడు టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు సీఎం జగన్.. అనిల్ కుంబ్లేను సాదరంగా పుష్పగుచ్ఛంతో ఆహ్వానించి కొద్దిసేపు మాట్లాడారు. ఈ భేటీలో ఇరువురు ఆంధ్రప్రదేశ్ లో క్రీడల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీలో స్పోర్ట్స్‌ యూనివర్శిటీ పెడితే తన వంతు సహకారం అందిస్తానని అనిల్ కుంబ్లే సీఎం జగన్ కు తెలిపారు. అంతేకాక క్రీడా సామగ్రి తయారీ ఫ్యాక్టరీని పెట్టే అంశంపైనా దృష్టిసారించాలని ఆయన సీఎంను కోరారు. ప్రస్తుతం జలంధర్, మీరట్‌ లాంటి నగరాలనుంచే అన్నిరకాల క్రీడా సామగ్రి ఉత్పత్తి అవుతోందని, అక్కడి నుంచే క్రీడా సామగ్రిని తెచ్చుకుంటున్నామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఫ్యాక్టరీ పెడితే క్రీడా సామగ్రి అందరికీ అందుబాటులోకి వస్తుందని సీఎంకు వివరించారు. దీనికి సంబంధించి తన అనుభవాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నానని కుంబ్లే చెప్పారు. ఈమేరకు సీఎం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

ఈ భేటీ అనంతరం అనిల్ కుంబ్లే.. తన కెరీర్ లో పది మైలురాళ్లను, వాటి విశేషాలను ఓ ఫొటో లో ఫ్రేమ్ చేయించి సీఎం జగన్ కు అందించారు. అలాగే సీఎం జగన్ కూడా అనిల్ కుంబ్లే ను శాలువాతో సన్మానించి, శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బహూకరించారు. ఈ మాజీ వెటరన్ క్రికెటర్ టీమిండియా తరపున 18 సంవత్సరాలపాటు తన సేవలు అందించాడు. బౌలర్, కెప్టెన్, కోచ్ లాంటి ఎన్నో రకాలుగా తన విలువైన సేవలు అందించాడు. ఎన్నో రికార్డును నెలకొల్పి భారత క్రికెట్ లో తనదైన ముద్ర వేశాడు. టెస్టుల్లో 619 వికెట్లు తీసిన ఈ అగ్రశ్రేణి బౌలర్.. వన్డేల్లో 337 వికెట్లు తీసి తన సత్తా చాటాడు.

Also Read:

HBD PV Sindhu: భారత బ్యాడ్మింటన్ క్వీన్ పీవీ సింధు గురించి మీకు తెలియని 5 విషయాలు..!

Viral Photo: వింబుల్డన్ లో సచిన్, విరాట్ జంటలు.. వైరలవుతోన్న ఆనాటి ఫొటో!