Jasprit Bumrah : అసలు తనకు ఐపీఎల్ ఎందుకు ? బీసీసీఐ బూమ్రాకు నష్టపరిహారం ఇవ్వాల్సిందే.. మాజీ కోచ్ సంచలనం

భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఆండర్సన్-టెండూల్కర్ సిరీస్ తర్వాత, ఫాస్ట్ బౌలర్ల పనిభారంపై చర్చ మొదలైంది. ఈ టెస్ట్ సిరీస్‌కు ముందే, టీమిండియా సెలెక్టర్లు బుమ్రా ఐదు టెస్టుల్లో కేవలం మూడు మాత్రమే ఆడతాడని చెప్పారు. ఇంగ్లాండ్‌తో సిరీస్ ముగిసే సరికి అదే నిజమైంది.

Jasprit Bumrah : అసలు తనకు ఐపీఎల్ ఎందుకు ? బీసీసీఐ బూమ్రాకు నష్టపరిహారం ఇవ్వాల్సిందే.. మాజీ కోచ్ సంచలనం
Jasprit Bumrah

Updated on: Sep 02, 2025 | 7:19 AM

Jasprit Bumrah : భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన ఆండర్సన్-టెండూల్కర్ సిరీస్ తర్వాత ఫాస్ట్ బౌలర్ల వర్క్​లోడ్ పై చర్చలు ఊపందుకున్నాయి. ఈ టెస్ట్ సిరీస్‌కు ముందుగానే టీమిండియా సెలెక్టర్లు బుమ్రా ఐదు టెస్టుల్లో కేవలం మూడు మాత్రమే ఆడతాడని ప్రకటించారు. ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్ ముగిసే సమయానికి అదే జరిగింది. ఇప్పుడు టీమిండియా మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, జస్ప్రీత్ బుమ్రాకు నష్టపరిహారం ఇవ్వాలని సూచించారు.

బుమ్రాకు ఎందుకు నష్టపరిహారం?

టైమ్స్ ఆఫ్ ఇండియా బాంబే స్పోర్ట్ ఎక్స్ఛేంజ్ పోడ్‌కాస్ట్‌లో భరత్ అరుణ్ మాట్లాడుతూ.. జట్టులో ఫాస్ట్ బౌలర్లు సేఫ్‎గా ఉండడం చాలా ముఖ్యం అని అన్నారు. బ్యాట్స్‌మెన్‌లు, స్పిన్నర్లు అన్ని ఫార్మాట్‌లలో ఆడగలరు.. కానీ ఫాస్ట్ బౌలర్లకు ఇది సాధ్యం కాదు అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌కు ముందు బుమ్రా ఐపీఎల్ ఆడకూడదని, అతనికి ఈ సీజన్ నుంచి విశ్రాంతి ఇవ్వాల్సి ఉందని భరత్ అరుణ్ అన్నారు.

జస్ప్రీత్ బుమ్రా లేదా ఇతర ఫాస్ట్ బౌలర్లకు ముఖ్యమైన సిరీస్‌కు ముందు కంప్లీట్ రెస్ట్ ఇవ్వాలని భరత్ అరుణ్ అభిప్రాయపడ్డారు. దీనితో పాటు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వారికి తగిన నష్టపరిహారం కూడా ఇవ్వాలని ఆయన సూచించారు. “బీసీసీఐ ఆటగాళ్లకు ఐపీఎల్‌కు బదులుగా ఈ సిరీస్‌పై దృష్టి పెట్టాలి. దాని కోసం రెడీ అవ్వాలి” అని చెప్పాలని భరత్ అరుణ్ అన్నారు.

ఐపీఎల్​కు ముందు బుమ్రాకు గాయం

భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా ఐదవ టెస్టులో వెన్నులో గాయం అయింది. దీని వల్ల బుమ్రా మూడు నెలల పాటు క్రికెట్‌కు దూరమయ్యాడు. ఆ తర్వాత ఐపీఎల్ 2025లో తిరిగి అడుగుపెట్టిన బుమ్రా, ముంబై ఇండియన్స్ తరపున 12 మ్యాచ్‌లు ఆడి 18 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో కేవలం మూడు మ్యాచ్‌లలోనే 14 వికెట్లు సాధించాడు. ఈ సమయంలో అతను రెండుసార్లు ఐదు వికెట్లు కూడా తీసుకున్నాడు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..