Team India First Victory in ODI: టీమిండియా వన్డేలో తొలి విజయాన్ని ఎప్పుడు నమోదు చేసిందో తెలుసా..?

|

Jun 23, 2021 | 8:26 PM

వన్డే క్రికెట్ లో భారత్ అడుగుపెట్టిన తరువాత తొలి విజయాన్ని నాలుగో మ్యాచ్‌లో నమోదు చేసింది. అది కూడా ప్రపంచకప్‌లో నమోదు చేయడం విశేషం. ఈ మ్యాచ్‌లో సునీల్ గవాస్కర్, బిషన్ సింగ్ బేడి.. స్టార్ హీరోలుగా మారిపోయారు.

Team India First Victory in ODI: టీమిండియా వన్డేలో తొలి విజయాన్ని ఎప్పుడు నమోదు చేసిందో తెలుసా..?
Sunil Gavaskar Bishan Bedi
Follow us on

Team India First Victory in ODI: భారత్ 1974లో తొలిసారి వన్డే క్రికెట్‌లోకి అడుగుపెట్టింది. క్రికెట్‌కి పుట్టినిల్లు అయిన ఇంగ్లండ్‌తో రెండు వన్డేల సిరీస్ ఆడింది. కానీ, ఈ రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. అనంతరం 1975లో ఏకంగా వన్డే ప్రపంచకప్‌లోకి బరిలోకి దిగింది. ఏమాత్రం అనుభవం లేకుండా ఈ టోర్నీలో బరిలోకి దిగింది. మొత్తం 8 జట్లు ఈ టోర్నమెంట్ లో పాల్గొన్నాయి. శ్రీనివాసరాఘవన్ వెంకటరాఘవన్ సారథ్యంలోని భారత్ జట్టు మొదటి ప్రపంచ కప్‌లోకి ఏమాత్రం అంచనాలు లేకుండా పోరుకి సిద్ధమైంది. ఇంగ్లండ్ టీం మాత్రం ఫేవరేట్‌గా బరిలోకి దిగింది.

1975 వన్డే ప్రపంచ కప్‌లో భారత్ తొలి మ్యాచ్లో త్రీ లయన్స్‌తో తలపడింది. కానీ, ఈ మ్యాచ్‌లో భారత్ 202 పరుగుల తేడాతో ఓడిపోయింది. అనంతరం రెండో మ్యాచ్‌ను తూర్పు ఆఫ్రికాతో ఆడేందుకు సిద్ధమైంది. మొదటి మ్యాచ్‌లో ఘోర పరాజయం తరువాత ఇక భారత్‌ ఏ మాత్రం పోటీ ఇవ్వదని అంతా అనుకున్నారు. కానీ, ఈ మ్యాచ్‌లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. తన తొలి విజయాన్ని నమోదు చేసింది. సరిగ్గా 45 సంవత్సరాల క్రితం జూన్ 11, 1975 న భారత్ తమ తొలి వన్డే విజయాన్ని నమోదు చేసింది.

అయితే, అప్పుడు వన్డేలో 60 ఓవర్లు ఉండేవి. ప్రతీ బౌలర్ గరిష్టంగా 12 ఓవర్లు బౌలింగ్ చేయాలి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన తూర్పు ఆఫ్రికా.. బ్యాటింగ్‌ చేసేందుకు సిద్ధమైంది. భారత సీమర్లు మదన్‌లాల్, సయ్యద్ అబిద్ అలీ తూర్పు ఆప్రికా టాప్‌ ఆర్డర్‌ లో 5 వికెట్లు తీసి సత్తా చాటారు. అనంతరం లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ బిషన్ సింగ్ బేడీ బౌలింగ్ చేసేందుకు రంగంలోకి దిగాడు. తన 12 ఓవర్లలో కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ పడగొట్టాడు. ఇందులో 8 ఓవర్లు మెయిడిన్‌లుగా నమోదయ్యాయి. దీంతో తూర్పు ఆఫ్రికా 120 పరుగులకు ఆలౌట్ అయింది.

అనంతరం భారత్ బ్యాటింగ్ ఆరభించింది. సునిల్ గవాస్కర్ తో కలిసి ఫరోజ్ ఇంజనీర్‌ ఓపెనర్లుగా బరిలోకి దిగి 29.5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా స్వల్ప లక్ష్యాన్ని చేధించి, భారత్‌కు తొలి విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో సునిల్ గవాస్కర్ 65 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్ ఇంజీర్ 54 పరుగులు చేశాడు. దీంతో భారత్ 10 వికెట్ల తేడాతో మొదటి విజయాన్ని సాధించింది.

కానీ, ఆవెంటనే ఆడిన మూడో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో నాలుగు వికెట్ల తేడాతో భారత్ ఓడిపోయింది. టోర్నమెంట్‌ నుంచి నిష్ర్కమించింది. ఇక తొలి ప్రపంచ కప్‌ ఫైనల్‌కు వెస్టిండీస్, ఇంగ్లండ్ టీంలు చేరుకున్నాయి. 17 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించి తొలి ప్రపంచ కప్ టోర్నమెంట్‌ను వెస్టిండీస్ టీం గెలుచుకుంది.

Also Read:

IND Vs NZ, WTC Final 2021 Day 6th Live: న్యూజిలాండ్‌ టార్గెట్ 139 పరుగులు.. 50 ఓవర్లు..

WTC Final 2021: విలియమ్సన్‌ను పెవిలియన్‌కు పంపమని సోను సూద్‌ని కోరిన అభిమాని.. ఏమని బదులిచ్చాడో తెలుసా?

Virat Kohli: “కోహ్లీలో ఎన్ని ఎక్స్‌ప్రెషన్లో.. మ్యాచ్‌ చివరకు ఎలాంటి ముఖాన్ని చూస్తామో” అంటూ ఐసీసీ వీడియో విడుదల: వైరలవుతోన్న వీడియో