T20 Cricket: కివీస్ స్టార్ సంచలన వ్యాఖ్యలు.. ప్రపంచ నంబర్-1 టీ20 బ్యాటర్ అతడేనట
T20 Cricket: ఫిన్ అలెన్ ప్రపంచ నంబర్-1 టీ20 బ్యాటర్‌గా టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్‌ను ఎంచుకున్నాడు. అభిషేక్ శర్మ, టిమ్ సీఫెర్ట్ వంటి ఆటగాళ్లను పక్కనపెట్టి ఇషాన్‌కు ఓటేశాడు. అదే సమయంలో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ టాలెంట్‌పై ప్రశంసలు కురిపించాడు. అతడి బ్యాట్ స్వింగ్, షాట్లను కొనియాడుతూ భవిష్యత్తులో టీ20 క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా ఎదుగుతాడని ఫిన్ అలెన్ చెప్పాడు.

T20 Cricket: ప్రపంచంలో నంబర్-1 టీ20 బ్యాట్స్‌మెన్ ఎవరనే ప్రశ్నక్రికెట్ ప్రపంచంలో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉంటుంది. ఈ ప్రశ్న పై న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ ఫిన్ అలెన్ స్పందించారు. ప్రముఖ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో చాలా మంది ఆటగాళ్లు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారని, అందుకే కేవలం ఒక్కరిని మాత్రమే ఎంచుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పనని తెలిపారు. ట్రిమ్ సీఫర్ట్, అభిషేక్ శర్మ వంటి మేటి ఆటగాళ్లు నిలకడగా పరుగులు సాధిస్తున్నప్పటికీ, ప్రస్తుత ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ నంబర్-1 బ్యాటర్ అయిన భారత డాషింగ్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌వైపే తాను మొగ్గు చూపుతున్నట్లు ఫిన్ అలెన్ స్పష్టం చేశారు.
వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల జల్లు
ఈ చర్చలో కేవలం సీనియర్ ఆటగాళ్లే కాకుండా, కేవలం 15 ఏళ్ల వయస్సులోనే సంచలనాలు సృష్టిస్తున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించి కూడా ఫిన్ అలెన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన వైభవ్, ఏకంగా 776 పరుగులు బాది ప్రపంచాన్ని అవాక్కయ్యేలా చేశాడని కొనియాడారు. ఆ తర్వాత జాతీయ జట్టుకు ఎంపికై జింబాబ్వే టూర్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును సైతం గెలుచుకున్నాడని గుర్తుచేశారు. వైభవ్ బ్యాట్ స్వింగ్ చేసే తీరు, ఆడే విధానం చూస్తుంటే ఎంతో అద్భుతంగా ఉంటుందని, భవిష్యత్తులో టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా ఎదుగుతాడనడంలో ఎలాంటి సందేహం లేదని ప్రశంసించారు. తాను బౌలర్ కానందుకు చాలా సంతోషిస్తున్నానని సరదాగా వ్యాఖ్యానించారు.
అక్టోబర్‌లో భారత్-న్యూజిలాండ్ సిరీస్
ఈ ఏడాది అక్టోబర్ నుంచి నవంబర్ మధ్యలో భారత జట్టు న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. ఈ టూర్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య 5 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌ల సిరీస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనుంది. ముఖ్యంగా ఈ టూర్‌లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తన స్వదేశంలో ఆడుతుంటే చూసేందుకు తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఫిన్ అలెన్ తెలిపారు. ఈ సిరీస్‌లో భాగంగా జరిగే టెస్ట్ మ్యాచ్‌లు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ రేసులో భారత్‌కు ఎంతో కీలకం కానుండటంతో క్రికెట్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
