శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో కెప్టెన్ అరోన్ ఫించ్ దూకుడుతో ఆస్ట్రేలియా 334 పరుగుల భారీ స్కోరు చేసింది. చివర్లో వరుసపెట్టి వికెట్లు కోల్పోడంతో 334 పరుగులకు పరిమితమైంది. 132 బంతులు ఎదుర్కొన్న ఫించ్ 15 ఫోర్లు, 5 సిక్సర్లతో 153 పరుగులు చేయగా, స్టీవెన్ స్మిత్ 73, గ్లెన్ మ్యాక్స్‌వెల్ 46 పరుగులు చేశారు.
తొలుత టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ను ఎంచుకొని ఆస్ట్రేలియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్(26), ఫించ్ రాణించడంతో తొలి వికెట్ కు ఆస్ట్రేలియా 80 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించింది. అనంతరం ఉస్మాన్ ఖవాజా కేవలం 10 పరుగులకే పెవిలియన్ బాటపట్టినప్పటికీ స్టీవ్ స్మిత్, ఫించ్ జోడీ సెటిలై పరుగుల వరద పారించడంతో ఏకంగా మూడోవికెట్ కు ఏకంగా 173పరుగుల భాగస్వామ్యం తోడైంది. ఆ తర్వాత 42 ఓవర్లో ఫించ్ ఔట్ కాగా, స్మిత్ కూడా ఆ తర్వాత ఓవర్లోనే పెవిలియన్ బాటపట్టాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మాక్స్ వెల్ ఆఖరి ఓవర్లలో బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడటంతో ఆస్ట్రేలియా స్కోరు 300 దాటింది.
Australia end their innings on 334/7!
Skipper Aaron Finch was their star with the bat, scoring 153 – the equal highest individual score of #CWC19 so far. pic.twitter.com/ws0yiAv6l6
— Cricket World Cup (@cricketworldcup) June 15, 2019