ఐపీఎల్ ఆడే ఛాన్స్ రాలే.. కట్‌చేస్తే.. ఏకంగా 19 వికెట్లతో దిగ్గజ టీంలకే దమ్కీ ఇచ్చిన రైతు బిడ్డ.. ఎవరంటే?

Ashok sharma: 2022 ఐపీఎల్ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఇతనిని రూ. 55 లక్షలకు కొనుగోలు చేసింది. కానీ మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. అనంతరం 2025లో రాజస్థాన్ రాయల్స్ రూ. 30 లక్షలకు దక్కించుకుంది. ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అతను కనబరుస్తున్న ఫామ్ చూస్తుంటే, రాబోయే ఐపీఎల్ సీజన్‌లో అశోక్ శర్మ ఖచ్చితంగా అరంగేట్రం చేసే అవకాశం కనిపిస్తోంది.

ఐపీఎల్ ఆడే ఛాన్స్ రాలే.. కట్‌చేస్తే.. ఏకంగా 19 వికెట్లతో దిగ్గజ టీంలకే దమ్కీ ఇచ్చిన రైతు బిడ్డ.. ఎవరంటే?
Ashok Sharma

Updated on: Dec 08, 2025 | 8:52 PM

 Ashok sharma: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) 2025లో రాజస్థాన్ ఫాస్ట్ బౌలర్ అశోక్ శర్మ తన అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన అశోక్, ఇప్పుడు దేశవాళీ క్రికెట్‌లో సంచలనం సృష్టిస్తున్నాడు.

అద్భుతమైన గణాంకాలు..

ఈ టోర్నమెంట్‌లో అశోక్ శర్మ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌లలో ఏకంగా 19 వికెట్లు పడగొట్టి వికెట్ల వేటలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. తన పేస్, స్వింగ్‌తో తమిళనాడు, కర్ణాటక వంటి బలమైన జట్ల బ్యాటర్లను కూడా ఇబ్బంది పెట్టాడు.

ఇవి కూడా చదవండి

అశోక్ శర్మ జైపూర్ సమీపంలోని రాంపురా గ్రామానికి చెందినవాడు. అతని తండ్రి నాథూ లాల్ శర్మ ఒక రైతు. జూన్ 17, 2002న జన్మించిన అశోక్, చిన్నప్పటి నుంచే క్రికెట్‌పై ఆసక్తి కనబరిచేవాడు. 2017లో జైపూర్ క్రికెట్ అకాడమీలో చేరడంతో అతని క్రికెట్ ప్రయాణం మలుపు తిరిగింది. గంటకు 130-140 కి.మీ వేగంతో బౌలింగ్ చేయగల సామర్థ్యం అతనికి రాజస్థాన్ రాయల్స్ నెట్ బౌలర్‌గా అవకాశం దక్కేలా చేసింది.

అశోక్ ప్రయాణం అంత సులభం కాలేదు. రాజస్థాన్ అండర్-19 జట్టుకు ఎంపికైన సమయంలోనే, కోవిడ్-19 మహమ్మారి కారణంగా తన కోచ్‌ను కోల్పోయాడు. అయినప్పటికీ, అతను మానసికంగా దృఢంగా ఉండి తన ఆటను మెరుగుపర్చుకున్నాడు.

ఐపీఎల్ ప్రయాణం..

2022 ఐపీఎల్ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఇతనిని రూ. 55 లక్షలకు కొనుగోలు చేసింది. కానీ మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. అనంతరం 2025లో రాజస్థాన్ రాయల్స్ రూ. 30 లక్షలకు దక్కించుకుంది. ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అతను కనబరుస్తున్న ఫామ్ చూస్తుంటే, రాబోయే ఐపీఎల్ సీజన్‌లో అశోక్ శర్మ ఖచ్చితంగా అరంగేట్రం చేసే అవకాశం కనిపిస్తోంది.

క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న ఈ రైతు బిడ్డ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం.