INDW vs ENGW: “మీరేమో 28 అంటున్నారు.. గూగుల్ మామ 17 అని చూపిస్తోంది”; సోనీ టెన్‌ ఛానెల్‌పై నెటిజన్ల ట్రోల్స్‌

|

Jun 28, 2021 | 7:52 AM

17 ఏళ్ల వయసులోనే షఫాలీ టీమిండియా మహిళల వన్డే జట్టులో చోటు దక్కించుకుంది. అయితే తాజాగా ఇంగ్లండ్ తో జరిగిన తొలి వన్డేలో ఆడిన షఫాలీ వర్మ కు సోనీ టెన్ ఛానెల్‌ తో చిత్రమైన అనుభవం ఎదురైంది.

INDW vs ENGW: మీరేమో 28 అంటున్నారు.. గూగుల్ మామ 17 అని చూపిస్తోంది; సోనీ టెన్‌ ఛానెల్‌పై నెటిజన్ల ట్రోల్స్‌
Shafali Varma
Follow us on

INDW vs ENGW: భారత మహిళలు ఆదివారం ఇంగ్లండ్‌తో మొదటి వన్డే ఆడిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌ లో భారత యువ ఉమెన్ క్రికెటర్ షఫాలీ వర్మ వన్డే క్రికెట్‌లో 131 వ ఉమెన్ క్రికెటర్‌గా ఎంట్రీ ఇచ్చింది. 17 ఏళ్ల వయసులోనే షఫాలీ టీమిండియా మహిళల జట్టులో చోటు దక్కించుకుంది. అయితే తాజాగా ఇంగ్లండ్ తో జరిగిన తొలి వన్డేలో ఆడిన షఫాలీ వర్మ కు సోనీ టెన్ ఛానెల్‌ తో చిత్రమైన అనుభవం ఎదురైంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ మొదలు పెట్టింది టీమిండియా. ఓపెనర్లుగా స్మృతి మందన, షఫాలీ వర్మ క్రీజులోకి వచ్చారు. అయితే సోనీ టెన్ చానెల్ ఈ యంగ్ ఉమెన్ స్టాట్స్ తప్పుగా చూపించారు. షఫాలీ వయస్సు 17 ఏళ్లు కాగా, టీవీలో 28 ఏళ్ళు అని స్టాట్స్‌లో చూపించారు. దీన్ని గమనించిన ఫ్యాన్స్‌.. సోనీ యాజమాన్యాన్ని ట్రోల్ చేశారు.

”షఫాలీ వయస్సు 17 అయితే.. 28 సంవత్సరాలుగా చూపించారు.. ఏం బాబు తాగేసి వచ్చారా..? అంటూ సోనీ యాజమాన్యంపై ఫైర్ అయ్యారు. తొలి మ్యాచ్‌లోనే షఫాలీకి ఇలాంటి అనుభవం ఎదురుకావడంతో మ్యాచ్‌ అనంతరం షఫాలీ ఎలా ఫీలవుతుందో పాపం అంటూ కొంతమంది కామెంట్ చేశారు. అలాగే చానెల్‌ నిర్వాహకులు నిద్రపోతూ పనిచేస్తున్నారంటూ.. షఫాలీ ఫొటోను వైరల్ చేసేశారు. అలాగే మరికొందరు” షఫాలీ వర్మ వయసు 28 అంట, మరి గూగుల్ అంకులేమో 17 అంటున్నాడు” అని సరదాగా కామెంట్ చేశారు. షఫాలీ వర్మ టీ20ల్లో దూకుడైన ఆటతీరుతో తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకుంది. సెహ్వాగ్‌ లాంటి దూకుడు ప్రదర్శిస్తూ.. ప్రస్తుతం మంచి ఫామ్‌లో కొనసాగుతోంది. దీంతో బీసీసీఐ ఆమెకు వన్డేల్లో ఆడే ఛాన్స్‌ కల్పించింది. షఫాలీ టీమిండియా తరపున 22 టీ20ల్లో 617 పరుగులు చేసింది. ఇందులో మూడు అర్థసెంచరీలు ఉన్నాయి. షఫాలీ 15 ఏళ్లకే టీ20లో అరంగేట్రం చేసింది. అనంతరం 17 సంవత్సరాలకు టెస్టు, వన్డేలో ఎంట్రీ ఇచ్చి ఔరా అనిపించింది. టీమిండియా తరపున అతి తక్కువ ఏజ్‌లో అన్ని ఫార్మెట్‌ లో ఆడిన రికార్డును సొంతం చేసుకుంది.

మ్యాచ్ విషయానికి వస్తే.. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఉమెన్స్‌ టీం అనుకున్నట్లే తడబడింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 201 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ మిథాలీ రాజ్‌ 72 పరుగులతో (108 బంతులు, 7 ఫోర్లు) అత్యధిక స్కోరరగా నిలిచింది. మిగతా బ్యాట్స్‌ ఉమెన్స్‌ విఫలం కావడంతో తక్కువ స్కోర్‌కే టీమిండియా మహిళలు పరిమిత మయ్యారు.

Also Read:

INDW vs ENGW: ఓటమితో మొదలు; తొలి వన్డేలో ఇంగ్లండ్ ఘన విజయం

Star archer Deepika: పారిస్​లో భారత్‌కు పసిడి పంట.. అదరగొట్టిన స్టార్ ఆర్చర్ దీపికా కుమారి

Tokyo Games: ప్రపంచ నెం.1 గా భారత స్టార్ బాక్సర్ అమిత్ పంగాల్.. ఇదే ర్యాంకుతో ఒలింపిక్స్‌ కు!

Happy Birthday Dale Steyn: దక్షిణాఫ్రికా వెటరన్‌ పేస్‌ బౌలర్‌ డేల్‌ స్టెయిన్ గురించి తెలియని విషయాలు..