భారత్, శ్రీలంక జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ మంగళవారం (జనవరి 10) ప్రారంభం కానుంది. టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్నా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్లీ జట్టులోకి వచ్చారు. కాగా గువహటి వేదికగా జరిగే ఈ మ్యాచ్ ముందు రన్ మెషిన్ కోహ్లీ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలీవుడ్ దివంగత నటుడు ఇర్ఫాన్‌ఖాన్ ఓ సందర్భంలో చెప్పిన మాటలను కోట్ చేస్తూ ‘
‘పేరు ప్రఖ్యాతులు రావాలని కోరుకోవడం కూడా ఓ రోగం లాంటిదే! ఏదో ఒకరోజు నేను ఈ జబ్బు నుంచి బయటపడాలి.. ఈ కోరికల వలయం నుంచి విముక్తి పొందాలని ఆశిస్తున్నా’ అని రాసుకొచ్చాడు విరాట్. అలాగే ‘ఈ గడ్డు సమయం కూడా గడిచిపోతుంది. ఇప్పుడు నీ పరిస్థితి ఏమంత బాగోలేదా? నీ పని ఇక అయిపోయిందనిపిస్తోందా? పరిస్థితులు చేయిదాటిపోతున్నాయనిపిస్తోందా? అయితే కాలంతో పాటే ప్రస్తుత కఠిన పరిస్థితులు కూడా మారిపోతాయి. నీకెదురైన ప్రశ్నలన్నింటికీ త్వరలోనే జవాబు దొరుకుతుంది. నీకే కాదు నిన్ను విమర్శించిన వాళ్లకూ నువ్వు సమాధానం చెప్పినట్లు అవుతుంది’ అని హాలీవుడ్ స్టార్ యాక్టర్ టామ్ హాంక్స్ చెప్పిన ఇన్‌స్పిరేషనల్ కోట్స్‌ను ప్రస్తావించాడు.
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లంకతో వన్డే సిరీస్‌కు ముందు ఈ మేరకు పోస్ట్ చేయడంలో ఆంతర్యమేంటని నెట్టింట జోరుగా చర్చ సాగుతోంది. బంగ్లాదేశ్ పర్యటన తర్వాత కాస్త విశ్రాంతి తీసుకున్న కోహ్లి తన కుటుంబంతో కలిసి కొత్త సంవత్సరాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్‌గా జరుపుకొన్నాడు. తన భార్య అనుష్కా, కూతురు వామికతో కలిసి వెకేషన్‌ను ఎంజాయ్ చేశాడు. లంకతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్నాడు విరాట్. ఇప్పుడీ వన్డే సిరీస్ ద్వారా మళ్లీ మైదానంలోకి దిగనున్నాడు. మొత్తం 3 మ్యాచ్‌లు జరగనున్నాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..