Lalit Modi: ఐసీయూలో ఐపీఎల్ సృష్టికర్త లలిత్‌ మోడీ.. కరోనా, న్యుమోనియా అటాక్‌తో క్షీణించిన ఆరోగ్యం

|

Jan 14, 2023 | 3:47 PM

ఆస్పత్రి బెడ్‌పై తాను ఉన్న ఫొటోస్, వీడియోలను కూడా లలిత్‌ మోడీ ఈ పోస్ట్‌లో షేర్‌ చేశారు. అలాగే కొవిడ్‌ పాజిటివ్‌ రిజల్ట్‌, 87 mm Hg రీడింగ్‌తో కూడిన పల్స్ ఆక్సిమీటర్, ఛాతీ ఎక్స్-రేలను పోస్ట్‌ చేశారు.

Lalit Modi: ఐసీయూలో ఐపీఎల్ సృష్టికర్త లలిత్‌ మోడీ.. కరోనా, న్యుమోనియా అటాక్‌తో క్షీణించిన ఆరోగ్యం
Lalit Modi
Follow us on

ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్‌ మోడీ ఆరోగ్యం క్షీణించింది. గత రెండు వారాల్లో రెండుసార్లు కరోనా బారిన పడిన ఆయన న్యుమోనియాతో బాధపడుతున్నారు. ప్రస్తుతం లండన్‌లోని ఆస్పత్రిలోని ఐసీయూలో లలిత్‌ మోడీ చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. ‘రెండు వారాల్లో రెండు సార్లు కరోనా సోకింది. కొవిడ్‌ కారణంగా నిర్బంధంలో ఉన్న సమయంలో న్యూమోనియా కూడా అటాక్ అవ్వడంతో చాలా ఇబ్బంది పడుతున్నా. ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఇద్దరు వైద్యుల సహాయంతో కలిసి లండన్‌లోని ఆస్పత్రిలో చేరాను. దురదృష్టవశాత్తు ఇప్పటికీ 24/7 బయటి ఆక్సిజన్‌తో ఉండాల్సి వచ్చింది. అందరికీ ధన్యవాదాలు’ అని ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు లలిత్‌ మోడీ. ఆస్పత్రి బెడ్‌పై తాను ఉన్న ఫొటోస్, వీడియోలను కూడా లలిత్‌ మోడీ ఈ పోస్ట్‌లో షేర్‌ చేశారు. అలాగే కొవిడ్‌ పాజిటివ్‌ రిజల్ట్‌, 87 mm Hg రీడింగ్‌తో కూడిన పల్స్ ఆక్సిమీటర్, ఛాతీ ఎక్స్-రేలను పోస్ట్‌ చేశారు.

త్వరగా కోలుకోవాలంటూ ..

కాగా ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అందరూ ‘గెట్ వెల్ సూన్’ అంటూ పోస్ట్ చేస్తున్నారు. మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, సుస్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్.. మోడీ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షించారు. గత ఏడాది బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నానంటూ ఆమెతో కలిసున్న ఫొటోలు షేర్‌ చేశారు లలిత్‌. అవి అప్పట్లో బాగా వైరలయ్యాయి. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే సుస్మితా సేన్ మాత్రం ఈ పుకార్లను పూర్తిగా ఖండించింది. అవన్నీ ఒట్టి వదంతులేనని కొట్టి పారేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..