ENG vs SL: మారని లంక జాతకం.. తొలి వన్డేలో ఘోర పరాజయం

|

Jun 30, 2021 | 7:14 AM

శ్రీలంక ఓటముల పరంపర కొనసాగుతోంది. ఇంగ్లండ్‌తో పొట్టి క్రికెట్‌లో మూడు టీ 20లు ఓడిపోయి సిరీస్‌ను 3-0తో చేజార్చుకున్న సంగతి తెలిసిందే.

ENG vs SL: మారని లంక జాతకం.. తొలి వన్డేలో ఘోర పరాజయం
Eng Vs Sl
Follow us on

ENG vs SL: శ్రీలంక ఓటముల పరంపర కొనసాగుతోంది. ఇంగ్లండ్‌తో పొట్టి క్రికెట్‌లో మూడు టీ 20లు ఓడిపోయి సిరీస్‌ను 3-0తో చేజార్చుకున్న సంగతి తెలిసిందే. నిన్న రాత్రి ఇంగ్లండ్ తో జరిగిన తొలి వన్డేలోనూ అదే ప్రదర్శన కొనసాగిస్తూ ఓడిపోయింది. పూర్తి ఓవర్లు ఆడకుండానే 185 పరుగులకు ఆలౌట్ అయ్యారు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన ఇంగ్లండ్ టీం కేవలం 34.5 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి విజయాన్ని సాధించింది. శ్రీలంక జట్టు ఏ దశలోనూ కోలుకోకుండా ఇంగ్లండ్ బౌలర్ క్రిస్ వోక్స్ దెబ్బతీశాడు. మరోవైపు ఇప్పటికే ఓటమిలో బాధలో ఉన్న లంక టీం.. ముగ్గురు ప్లేయర్లపై బబుల్ రూల్స్ పాటించనుందుకుగాను వన్డేల్లో ఆడకుంగా బోర్డు నిషేధం విధించిన సంగతి తెలిసింది. లంక టీం పరిస్థితిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 42.3 ఓవర్లలో 185 పరుగులకే ఆలౌటైంది. ఆ టీంలో కుశాల్‌ పెరీరా (73; 7 ఫోర్లు, 81 బంతులు), హసరంగ (54; 6 ఫోర్లు, 1 సిక్స్‌, 65 బంతులు) రాణించగా.. మిగతా వారు కనీసం క్రీజులో నిలదొక్కుకోలేక పోయారు. ఇంగ్లండ్‌ బౌలర్‌ లలో క్రిస్‌ వోక్స్‌ 18 పరుగులిచ్చి 4 వికెట్లు తీశి, లంక టీం ను వెన్ను విరిచాడు. దీంతో ఆయనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ గా ఎన్నికయ్యాడు. విల్లే 3 వికెట్లు పడగొట్టాడు. అనంరతం ఇంగ్లండ్‌ 34.5 ఓవర్లలో 189 పరుగులు చేసి విజయం సాధించింది. ఇంగ్లండ్ టీంలో జో రూట్‌ (79 నాటౌట్‌; 4 ఫోర్లు, 87 బంతులు) అజేయ హాఫ్ సెంచరీ సాధించి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఓపెనర్‌ బెయిర్‌స్టో (43; 6 ఫోర్లు, 1 సిక్స్‌, 21 బంతులు) రాణించాడు. లంక బౌలర్లలో దుశ్‌మంత చమీరకు 3 వికెట్లు దక్కాయి. మూడు వన్డేల సిరీస్‌లో ఇంగ్లండ్ టీం 1-0 తేడాతో ముందుకు దూసుకెళ్లింది. రెండో వన్డే జులై 1 లండన్‌లో జరగనుంది.

Also Read:

RRR Viral Poster: హెల్మెట్ ఉంటే బాగుండేదన్న సైబరాబాద్ పోలీసులు.. నంబర్ ప్లేట్ మిస్సైందన్న ఆర్ఆర్ఆర్ టీం..! వైరలవుతోన్న డేవిడ్ వార్నర్ పోస్టర్‌

T20 World Cup: అక్టోబర్ 17 నుంచి టీ20 ప్రపంచకప్‌.. ఐసీసీ ప్రకటన!

ఇంగ్లండ్ వీధుల్లో టీమిండియా ఉమెన్స్‌.. ఆటలోనే కాదు అందంలోనూ పోటీపడుతోన్న మిథాలీ సేన!