మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, నెదర్లాండ్స్(england vs netherlands) మధ్య తొలి మ్యాచ్ ఆమ్‌స్టెల్‌వీన్‌లో జరుగుతోంది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. కేవలం ఒక పరుగుకే జాసన్ రాయ్ రూపంలో ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత డేవిడ్ మలాన్, ఫిలిప్ సాల్ట్ వేగంగా పరుగులు జోడించారు. వీరిద్దరూ డబుల్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. డేవిడ్ మలన్ తన అద్భుతమైన సెంచరీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అయితే, మలాన్ కొట్టిన ఓ సిక్సర్ అంతర్జాతీయ మ్యాచ్‌లో అద్భుతమైన డ్రామాగా మారింది.
పొదల్లోకి దూరిన ఆటగాళ్లు..
ఈ సిక్స్ తర్వాత బంతి కనిపించకుండా పోయింది. నెదర్లాండ్స్ ఆటగాళ్ళు మ్యాచ్ నుంచి బయటకు వెళ్లి పొదల్లో బంతి కోసం వెతుకుతూ కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. 8వ ఓవర్‌లో ఇలాంటి సీన్ కనిపించింది. పీటర్ వేసిన బంతిని లాంగ్ ఓవర్‌లో మలన్ అద్భుతంగా సిక్సర్ కొట్టాడు. సరిహద్దుల్లోని పొదల్లో బంతి పడింది. దీంతో మైదానం సిబ్బంది, ఆటగాళ్లు బంతిని వెతకడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మలన్ తన వన్డే కెరీర్‌లో 90 బంతుల్లోనే తొలి సెంచరీని నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్ 7 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు.
Drama in Amstelveen as the ball ends up in the trees ? pic.twitter.com/MM7stEMHEJ
— Henry Moeran (@henrymoeranBBC) June 17, 2022
టీ20 కప్ సన్నాహాలపై పూర్తి దృష్టి..
సిరీస్ ప్రారంభం కావడానికి ముందు, ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అనేక ద్వైపాక్షిక సిరీస్‌లు, T20 ప్రపంచ కప్‌తో కూడిన రాబోయే సీజన్‌లో టీం ఎలా ఆడనుందో చూపిస్తున్నాడు. సరైన ఆటగాళ్లను సరైన పాత్రల్లోకి తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందని ఇంగ్లీష్ కెప్టెన్ చెప్పుకొచ్చాడు. ప్రపంచకప్ సన్నాహాల్లో జులై నెల మాకు చాలా ముఖ్యమైనది. జులైలో భారత్, దక్షిణాఫ్రికా లాంటి బలమైన జట్లతో ఆడాల్సి ఉందని తెలిపాడు.