England vs India, 1st ODI: కష్టాల్లో ఇంగ్లండ్.. 4 కీలక వికెట్లు డౌన్.. బుమ్రా, షమీల విధ్వంసం..

|

Jul 12, 2022 | 6:04 PM

England vs India, 1st ODI: ఓవల్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతోన్న తొలి వన్డే మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. 3 ఓవర్లు పూర్తయ్యే సరికి ఇంగ్లండ్ టీం 3 కీలక వికెట్లు కోల్పోయి...

England vs India, 1st ODI: కష్టాల్లో ఇంగ్లండ్.. 4 కీలక వికెట్లు డౌన్.. బుమ్రా, షమీల విధ్వంసం..
Follow us on

England vs India, 1st ODI: ఓవల్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతోన్న తొలి వన్డే మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. 6 ఓవర్లు పూర్తయ్యే సరికి ఇంగ్లండ్ టీం 4 కీలక వికెట్లు కోల్పోయి 22పరుగులు సాధించింది.

బుమ్రా విధ్వంసక బౌలింగ్‌తో ఇంగ్లండ్ విలవిల..

జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్‌కు ఆదిలోనే షాకిచ్చాడు. తన తొలి ఓవర్‌లోనే ఇద్దరు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్‌కు పంపాడు. ముందుగా అతను జాసన్ రాయ్‌ను బౌల్డ్ చేసి, డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత నంబర్-3లో బ్యాటింగ్ కు వచ్చిన జో రూట్ ఖాతా కూడా తెరవలేక రిషబ్ పంత్ చేతికి చిక్కాడు. బుమ్రా బౌలింగ్ లో జానీ బెయిర్ స్టో 7 పరుగులు చేసి పంత్ చేతికి చిక్కాడు. ఇదిలా ఉంటే గాయం కారణంగా విరాట్ కోహ్లీ తొలి మ్యాచ్ ఆడడం లేదు. అతని స్థానంలో శ్రేయాస్ అయ్యర్ నంబర్-3లో బ్యాటింగ్ చేయనున్నాడు. అదే సమయంలో రోహిత్‌తో కలిసి శిఖర్ ధావన్ బ్యాటింగ్‌ చేయనున్నాడు.

రెండు జట్ల ప్లేయింగ్ XI..

భారత్ – రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ప్రశాంత్ కృష్ణ మరియు యుజ్వేంద్ర చాహల్.

ఇవి కూడా చదవండి

ఇంగ్లండ్ : జాసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, లియామ్ లివింగ్‌స్టన్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ (కెప్టెన్), మోయిన్ అలీ, డేవిడ్ విల్లీ, బ్రైడెన్ కార్స్, క్రైగ్ ఓవర్టన్, రీస్ టోప్లీ.