IND vs ENG: భారత్‌లో రికార్డులు కొల్లగొట్టిన ఇంగ్లండ్.. ఆస్ట్రేలియా భారీ షాక్..

India vs England: భారత్-ఇంగ్లండ్ మధ్య ఫిబ్రవరి 2 నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌ ద్వారా మళ్లీ పుంజుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఈ విజయంతో భారత్‌లో అత్యధిక టెస్టు మ్యాచ్‌లు గెలిచిన ఘనత సాధించిన విదేశీ జట్టుగా ఇంగ్లండ్ జట్టు నిలిచింది. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా జట్టు పేరిట ఉండేది.

IND vs ENG: భారత్‌లో రికార్డులు కొల్లగొట్టిన ఇంగ్లండ్.. ఆస్ట్రేలియా భారీ షాక్..
Ind Vs Eng Records
Follow us
Venkata Chari

|

Updated on: Jan 31, 2024 | 10:04 AM

India vs England 2nd Test: హైదరాబాద్ వేదికగా భారత్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు అద్భుత విజయం సాధించి ప్రత్యేక రికార్డును లిఖించింది. అది కూడా ఆస్ట్రేలియా జట్టు పేరిట ఉన్న అరుదైన రికార్డును బద్దలు కొట్టడం విశేషం. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 246 పరుగులు చేయగా, భారత్ 436 పరుగులు చేసింది. అలాగే రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 420 పరుగులు చేసి భారత్‌కు 231 పరుగుల లక్ష్యాన్ని అందించింది. అయితే, ఈ సులభమైన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా కేవలం 202 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్‌ జట్టు 28 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఈ విజయంతో భారత్‌లో అత్యధిక టెస్టు మ్యాచ్‌లు గెలిచిన ఘనత సాధించిన విదేశీ జట్టుగా ఇంగ్లండ్ జట్టు నిలిచింది. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా జట్టు పేరిట ఉండేది.

భారత్‌లో 54 టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఆస్ట్రేలియా మొత్తం 14 సార్లు టీమిండియాపై విజయం సాధించింది. దీంతో వెస్టిండీస్ రికార్డును సమం చేసింది. అంటే, ఆస్ట్రేలియా కంటే ముందు ఈ రికార్డు వెస్టిండీస్ జట్టు పేరిట ఉంది. భారత్‌లో 47 టెస్టు మ్యాచ్‌లు ఆడిన వెస్టిండీస్ జట్టు 14 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

ఇప్పుడు ఈ రెండు జట్ల రికార్డును ఇంగ్లండ్ చెరిపేసింది. భారత్‌లో టీమ్‌ఇండియాతో జరిగిన 65 టెస్టు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ జట్టు 15 విజయాలు సాధించింది. దీంతో స్వదేశంలో భారత్‌పై అత్యధిక ఓటములు సాధించిన జట్టుగా ఇంగ్లండ్‌ రికార్డు సృష్టించింది.

తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన ఇంగ్లండ్ ఇప్పుడు రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. మరి ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం వేదికగా జరిగే ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా తొలి ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటుందో లేదో చూడాలి.

భారత టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా , సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్, అవేష్ ఖాన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..