Test Records: క్యాచ్‌లతో ప్రపంచ రికార్డ్ లిఖించిన స్టార్ ప్లేయర్.. ఆ స్పెషల్ జాబితాలో చోటు

|

Sep 01, 2024 | 2:20 PM

Joe Root Record: టెస్టు క్రికెట్‌లో 200 క్యాచ్‌లు పట్టిన 4వ ఫీల్డర్‌గా జో రూట్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇంతకు ముందు భారత్‌కు చెందిన రాహుల్ ద్రవిడ్, దక్షిణాఫ్రికాకు చెందిన జాక్వెస్ కలిస్, శ్రీలంకకు చెందిన మహేల జయవర్ధనే ఈ ఘనత సాధించారు. ఇప్పుడు ఈ జాబితాలోకి జో రూట్ ఎంట్రీ ఇచ్చాడు.

Test Records: క్యాచ్‌లతో ప్రపంచ రికార్డ్ లిఖించిన స్టార్ ప్లేయర్.. ఆ స్పెషల్ జాబితాలో చోటు
Eng Vs Sl Joe Root
Follow us on

Joe Root Record: టెస్టు క్రికెట్ చరిత్రలో కేవలం నలుగురు ఆటగాళ్లు మాత్రమే 200+ క్యాచ్‌లు పట్టారు. ఈ జాబితాలో ఇంగ్లండ్‌ ఆటగాడు జో రూట్‌ కొత్తగా చేరాడు. లార్డ్స్ మైదానంలో శ్రీలంకతో జరుగుతున్న 2వ టెస్టు మ్యాచ్‌లో రెండు క్యాచ్‌లతో రూట్ టెస్టులో 200 క్యాచ్‌లు అందుకున్నాడు.

దీంతో ఈ ఘనత సాధించిన ప్రపంచంలో 4వ ఫీల్డర్‌గా నిలిచాడు. ఇంతకు ముందు భారత్‌కు చెందిన రాహుల్ ద్రవిడ్, శ్రీలంకకు చెందిన మహేల జయవర్ధనే, దక్షిణాఫ్రికాకు చెందిన జాక్వెస్ కలిస్‌లు ఈ ఘనత సాధించారు. ఇప్పుడు రూట్ కేవలం 145 మ్యాచ్‌లతో ఈ సాధకుల జాబితాలో చేరాడు.

టెస్టు క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ప్రపంచ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ పేరిట ఉంది. ద్రవిడ్ 301 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 210 క్యాచ్‌లు అందుకున్నాడు.

ఈ జాబితాలో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే రెండో స్థానంలో ఉన్నాడు. జయవర్ధనే 270 ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 205 క్యాచ్‌లు పట్టి ఈ రికార్డును లిఖించాడు.

అలాగే దక్షిణాఫ్రికా తరపున 315 ఇన్నింగ్స్‌ల్లో ఫీల్డింగ్ చేసిన జాక్వెస్ కల్లిస్ మొత్తం 200 క్యాచ్‌లు అందుకున్నాడు. జో రూట్ ఇప్పుడు కలిస్ రికార్డును సమం చేయడంలో విజయం సాధించాడు.

ఇంగ్లండ్ తరపున 275 ఇన్నింగ్స్‌లలో ఫీల్డింగ్ చేసిన జో రూట్ 200 క్యాచ్‌లు అందుకున్నాడు. అలాగే రానున్న మ్యాచ్‌ల్లో 11 క్యాచ్‌లు తీసుకుంటే టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా జో రూట్ ప్రపంచ రికార్డు సృష్టించనున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..