India vs England: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును మెన్స్ విభాగంలో విభాగంలో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ దక్కించుకున్నాడు. అలాగే మహిళల విభాగంలో ఐర్లాండ్ ఉమెన్ క్రికెటర్ ఈమెయర్ రిచర్డ్సన్ అందుకుంది. ఈ మేరకు ఐసీసీ సోమవారం ప్రకటించింది. ఈ అవార్డు రేసులో రూట్‌తో పాటు భారత్ నుంచి జస్‌ప్రీత్ బుమ్రా, పాక్ నుంచి షాహిన్ అఫ్రిదిలు కూడా పోటీ పడ్డారు. చివరకు ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ అద్భుత ప్రదర్శనతో ఆగస్టు నెలకుగానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నాడు. అయితే ఇందుకు మాత్రం కచ్చితంగా టీమిండియాతో జరిగిన టెస్టు సిరీస్ కలిసొచ్చిందనే చెప్పుకోవాలి. ఈ సిరీస్‌లో జో రూట్ వరుస సెంచరీలతో పలు రికార్డులు నెలకొల్పాడు. అలాగే ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు.
ఇక ఉమెన్స్ విభాగంలో ఐర్లాండ్ ఉమెన్ క్రికెటర్ ఈమెయర్ రిచర్డసన్ ఈ అవార్డును దక్కించుకుంది. ఐసీసీ ఉమెన్స్ టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. దీంతోపాటు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా ఎంపికైంది. జర్మనీతో జరిగిన ఓ మ్యాచ్‌లో 2/6తో బెస్ట్ గణాంకాలు నమోదు చేసింది. అనంతరం నెదర్లాండ్స్, ఫ్రాన్స్‌లతో జరిగిన మ్యాచ్‌ల్లోనూ మంచి ప్రదర్శనతో ఆకట్టుకుంది. దీంతోనే ఐసీసీ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో నిలించింది.
తనకు పోటీగా ఎవరూ అలాంటి ప్రదర్శన ఇవ్వకపోవడంతో ఐసీసీ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డును దక్కించుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అవార్డును సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇది అసలు ఊహించనేలేదు. ఓట్లు వేసి గెలిపించిన అభిమానులకు కృతజ్ఞతలు అంటూ సంతోషం వ్యక్తం చేసింది.