Ind vs Eng: 24 గంటల ముందే షాకిచ్చిన ఇంగ్లండ్.. ప్లేయింగ్ 11 నుంచి 700 వికెట్లు తీసిన బౌలర్ ఔట్.. యంగ్ ప్లేయర్‌ డెబ్యూ

|

Jan 24, 2024 | 2:15 PM

England Playing XI against India 1st Test: జనవరి 25 నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య హైదరాబాద్ టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు తన ప్లేయింగ్-11ని ప్రకటించగా జేమ్స్ అండర్సన్‌కు చోటు దక్కలేదు. ఈ మేరకు ఆ జట్టు ప్లేయింగ్-11తో అందరినీ ఆశ్చర్యపరిచింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ తీసుకున్న ఈ నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశమైంది. కాగా, ప్లేయింగ్-11ని టీమ్ ఇండియా ఇంకా ప్రకటించలేదు.

Ind vs Eng: 24 గంటల ముందే షాకిచ్చిన ఇంగ్లండ్.. ప్లేయింగ్ 11 నుంచి 700 వికెట్లు తీసిన బౌలర్ ఔట్.. యంగ్ ప్లేయర్‌ డెబ్యూ
England Playing Xi
Follow us on

India vs England, 1st Test: హైదరాబాద్‌లో భారత్‌తో ప్రారంభమయ్యే తొలి టెస్టు మ్యాచ్‌కు 24 గంటల ముందే ఇంగ్లండ్ జట్టు తన ప్లేయింగ్-11ను ప్రకటించి షాక్ ఇచ్చింది. ఐదు టెస్టుల ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ తొలి మ్యాచ్‌లోనే ఆధిక్యం సాధించాలని ప్రయత్నిస్తుంది. ఈ మేరకు ఆ జట్టు ప్లేయింగ్-11తో అందరినీ ఆశ్చర్యపరిచింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ తీసుకున్న ఈ నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశమైంది.

భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ముగ్గురు స్పిన్నర్లతో పాటు, ఓ ఫాస్ట్ బౌలర్‌తో ఇంగ్లండ్ బరిలోకి దిగాలని నిర్ణయించుకుంది. ఇంగ్లండ్ ప్లేయింగ్-11లో మార్క్ వుడ్, టామ్ హార్ట్లీ, రెహాన్ అహ్మద్‌లను తీసుకుంది. మార్క్ వుడ్ మాత్రమే ఫాస్ట్ బౌలర్‌గా ఆడనున్నాడు. అంటే ఇప్పటికే వెటరన్ బౌలర్ జేమ్స్ అండర్సన్‌ను ఇంగ్లండ్ తొలి మ్యాచ్‌ నుంచి తప్పించింది. 41 ఏళ్ల జేమ్స్ అండర్సన్ తన టెస్టు కెరీర్‌లో 690 వికెట్లు పడగొట్టాడు.

తొలి మ్యాచ్‌కి ఇంగ్లండ్ ప్లేయింగ్-11:

జాక్ క్రాలే, బెన్ డకెట్, ఆలీ పాప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (సి), బెన్ ఫోక్స్, రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జాక్ లీచ్

కష్టాల్లో ఇంగ్లండ్ జట్టు..

మొదటి టెస్ట్ మ్యాచ్ ఇంగ్లండ్‌కు కష్టాలతో నిండి ఉంది. ఎందుకంటే జట్టు స్పిన్నర్‌లలో ఒకరైన షోయబ్ బషీర్ వీసా విషయంలో సమస్యలను ఎదుర్కొంటున్నాడు. అతను ఇంకా భారత్‌లోకి ప్రవేశించలేదు. కాబట్టి, అతను మొదటి మ్యాచ్‌కు అందుబాటులో ఉండడు. దీంతో ఇంగ్లండ్ తమ ప్లాన్‌లో కొన్ని మార్పులు చేయాల్సి రావడంతో ఈ తరహా ప్లేయింగ్-11 తెరపైకి వచ్చింది.

కోహ్లీ స్థానంలో ఎవరు ఆడతారు?

ఒకవైపు ఇంగ్లండ్ వెటరన్ ఆటగాడు జేమ్స్ ఆండర్సన్ తొలి టెస్ట్‌కు దూరమవ్వగా.. మరోవైపు భారత్ తరపున విరాట్ కోహ్లీ తొలి రెండు టెస్టు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడం లేదు. విరాట్ స్థానంలో రజత్ పాటిదార్‌ను టీమ్ ఇండియా జట్టులోకి తీసుకున్నారు, ప్లేయింగ్-11లో ఎవరికి చోటు కల్పిస్తారనేది ప్రశ్నగా నిలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..