Team India: భారత్‌లో క్రికెట్ పాఠాలు.. కట్ చేస్తే.. పాకిస్తాన్‌పై బ్యాట్‌తో ఊచకోత.. ఆ ప్లేయర్ ఎవరంటే?

|

Feb 27, 2023 | 1:09 PM

భారత్‌లో క్రికెట్ పాఠాలు నేర్చుకున్న ఆ ప్లేయర్.. నాటింగ్‌హామ్ వేదికగా జరిగిన ఓ టెస్ట్‌లో పాకిస్తాన్‌కు చుక్కలు చూపించాడు..

Team India: భారత్‌లో క్రికెట్ పాఠాలు.. కట్ చేస్తే.. పాకిస్తాన్‌పై బ్యాట్‌తో ఊచకోత.. ఆ ప్లేయర్ ఎవరంటే?
Cricket
Follow us on

భారత్‌లో క్రికెట్ పాఠాలు నేర్చుకున్న ఆ ప్లేయర్.. నాటింగ్‌హామ్ వేదికగా జరిగిన ఓ టెస్ట్‌లో పాకిస్తాన్‌కు చుక్కలు చూపించాడు. ఆ మ్యాచ్‌లో అతడు తుఫాన్ సెంచరీతో చెలరేగడమే కాకుండా.. తన జట్టుకు ఇన్నింగ్స్ 129 పరుగుల తేడాతో విజయాన్ని అందించాడు. అతడు మరెవరో కాదు ఇంగ్లీషు క్రికెటర్ రెగ్ సింప్సన్. నేడు ఆయన 103వ జయంతి.

1920వ సంవత్సరం, ఫిబ్రవరి 27న నాటింగ్‌హామ్‌లో జన్మించిన సింప్సన్ 13 సంవత్సరాల వయస్సులో క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. అయితేనేం అతడు క్రికెట్‌లో పాఠాలు నేర్చుకున్నది మాత్రం ఇండియాలో.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌ అరంగేట్రం కూడా భారత్‌లోనే చేశాడు. ఆ తర్వాత అతడి కెరీర్ వేగం పుంజుకుంది. అలాగే, యుద్ధం జరుగుతోన్న సమయంలో అతడు రాయల్ ఎయిర్ ఫోర్స్‌కు పైలట్‌గా పనిచేశాడు. ఈ తరుణంలోనే, సింప్సన్.. ప్రముఖ క్రికెటర్లు వాలీ హమ్మండ్, బిల్ ఎడ్రిచ్ వంటి అనుభవజ్ఞులతో ఆడే అవకాశం దక్కింది.

భారతదేశంలో ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసిన సింప్సన్.. సరిగ్గా 18 నెలల తర్వాత నాటింగ్‌హామ్‌షైర్ తరపున ఆడాడు. 1948-1949లో ఇంగ్లాండ్ జాతీయ జట్టులోకి అడుగుపెట్టాడు. అతడు ఇంగ్లీష్ జట్టు తరపున 27 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 4 సెంచరీలు, 6 అర్ధ సెంచరీలతో సహా మొత్తం 1401 పరుగులు చేశాడు. అదే సమయంలో, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో, అతడు 495 మ్యాచ్‌లలో 30 వేల 546 పరుగులు చేశాడు. ఇందులో 64 సెంచరీలు, 159 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

సెంచరీతో ఇంగ్లిష్ జట్టులోకి పునరాగమనం..

సింప్సన్ తన అరంగేట్రం టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 5 పరుగులు మాత్రమే చేయగలిగాడు. రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు. ఇక మళ్లీ 7 నెలల తర్వాత, జట్టులోకి వచ్చిన సింప్సన్.. న్యూజిలాండ్‌పై సెంచరీ బాదేశాడు. అయితే, అతడు జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోయాడు. 1950-1951 యాషెస్ సిరీస్‌లో సింప్సన్ మొత్తంగా 349 పరుగులు చేశాడు. సిరీస్‌లోని చివరి టెస్ట్ మ్యాచ్‌లో, సింప్సన్ అజేయంగా 156 పరుగులు చేశాడు. అలాగే అతడు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్‌లపై 4 అంతర్జాతీయ టెస్టు సెంచరీలు నమోదు చేశాడు. ఇక టీమిండియాపై 2 అర్ధ సెంచరీలు బాదాడు. కాగా, క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించిన అనంతరం సింప్సన్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడిగా పని చేశాడు. కాగా, 2010లో 93 ఏళ్ల వయసులో ఆయన తన తుదిశ్వాస విడిచారు.