క్రికెట్ ప్రపంచంలో బెస్ట్ ఫీల్డర్ ఎవరంటే.. అప్పట్లో జోంటీ రోడ్స్.. ఇప్పుడు టీమిండియా ప్లేయర్ రవీంద్ర జడేజా అని అంటారు. అయితే వీరి కంటే గొప్ప ఫీల్డర్ మరొకరు ఉన్నారు. అతడు సాధించిన రికార్డులను దిగ్గజ క్రికెటర్లు సైతం దరికి చేరలేరు. ఫీల్డింగ్‌లో అయితే అతడే రారాజు ఏకంగా 1000 క్యాచ్‌లు అందుకున్నారు. అతడు ఎవరో కాదు గొప్ప ఆల్ రౌండర్లలో ఒకరైన ఫ్రాంక్ వూలీ. ఈ రోజు మే 27 అతడి పుట్టినరోజు.
ఫ్రాంక్ వూలీ 1887వ సంవత్సరం మే 27న కెంట్‌లో జన్మించాడు. ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మన్, లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ వూలీ ఇంగ్లాండ్ తరపున 64 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి, 36.07 సగటుతో 3284 పరుగులు చేశాడు. వూలీకి కెంట్, MCC జీవితకాల సభ్యత్వం ఇచ్చారు. ఫ్రాంక్ వూలీ తన కెరీర్‌లో 978 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు, దీనిలో అతడు 40.77 సగటుతో 58959 పరుగులు చేశాడు. ఇందులో అతని ఉత్తమ స్కోరు 305 పరుగులు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 145 సెంచరీలు సాధించడమే కాకుండా, 295 అర్ధ సెంచరీలు కూడా చేశాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అతను 1018 క్యాచ్‌లు కూడా పట్టాడు. ఇది ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ప్రపంచ రికార్డు.
Also Read:
మామిడి పండ్లు తిని ఈ 5 ఆహార పదార్ధాలను అస్సలు తినకండి.. చాలా డేంజర్.! ఎందుకంటే?
టీకా తీసుకుంటే రెండేళ్లలో చనిపోతారా.? నెట్టింట్లో వైరల్ పోస్ట్.. అసలు నిజం ఏమిటంటే.?
సర్కస్ ట్రైనర్‌పై సింహాల మెరుపు దాడి.. గగుర్పొడిచే దృశ్యాలు.. వైరల్ వీడియో.!