Ben Stokes: ఇంగ్లండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్ ఇంట్లో దొంగల బీభత్సం.. చివరకు వాటిని కూడా వదలకుండా..

ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇంట్లో దోపిడీ జరిగింది. ఈ విషయాన్ని అతనే సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు ఆవేదన వ్యక్తం చేసిన బెన్ స్టోక్స్.. తన పోస్ట్ లో కొన్ని వస్తువుల ఫొటోలను కూడా షేర్ చేశాడు.

Ben Stokes: ఇంగ్లండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్ ఇంట్లో దొంగల బీభత్సం.. చివరకు వాటిని కూడా వదలకుండా..
England Cricketer Ben Stokes

Updated on: Oct 31, 2024 | 8:01 PM

ఇంగ్లండ్‌ క్రికెట్‌ కెప్టెన్‌ బెన్‌స్టోక్స్‌ ఇంట్లో దోపిడీ జరిగింది. ఇది జరిగి రెండు వారాల తర్వాత అసలు విషయం బయటకు వచ్చింది. తన ఇంట్లో విలువైన వస్తువులను పోగొట్టుకున్నానంటూ కొన్ని గంటల క్రితం బెన్‌స్టోక్స్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. తనకు సాయం చేయాలని అధికారులు, ఇంగ్లండ్‌ పౌరులను కోరుతున్నాడు బెన్‌ స్టోక్స్‌. తన ఇంట్లో చోరీకి గురైన వస్తువుల ఫొటోలను కూడా షేర్‌ చేసుకున్నాడు. గత నెల రోజుల నుంచి పాకిస్తాన్‌ పర్యటనలో ఉన్నాడు ఇంగ్లిష్‌ క్రికెటర్‌ బెన్‌ స్టోక్స్‌. దీంతో దొంగలు పక్కా స్కెచ్‌తో అతడి ఇంటిని దోచేశారు. అక్టోబర్ 17న ఈ ఘటన జరిగింది. నార్త్ఈస్ట్ ఇంగ్లండ్‌లోని కాస్టల్‌ ఈడెన్ ఏరియాలో ఉన్న ఇంట్లోకి ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు వచ్చి దోపిడీకి పాల్పడ్డారని చెప్పాడు బెన్‌ స్టోక్స్‌. తన భార్య, పిల్లలు ఇంట్లోనే ఉన్నారని.. వారికి ఎలాంటి హానీ జరగలేదని వెల్లడించాడు. దయచేసి ఎవరైతే ఈ చర్యకు పాల్పడ్డారో.. వారికిదే నా విన్నపం అంటూ Xలో పోస్ట్‌ పెట్టాడు. ఆ వస్తువులను తీసుకొచ్చి ఇవ్వాల్సిందిగా కోరుతున్నా అన్నాడు.

అదృష్టవశాత్తూ తన భార్యాపిల్లలకు ఎలాంటి హానీ జరగలేదని.. శారీరకంగా ఇబ్బందిలేకపోయినా.. మానసికంగా మాత్రం వారిని కలవరపరిచిందన్నాడు స్టోక్స్‌. దానినిబట్టే అప్పటి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నాడు. చోరీకి గురైన కొన్ని వస్తువుల ఫొటోలను బెన్‌స్టోక్స్ షేర్ చేశాడు. అందులో నగలు ఉన్నాయి. డిజైనర్‌ బ్యాగ్, క్రికెట్‌కు అందించిన సేవలకు గౌరవార్థంగా ప్రభుత్వం ఇచ్చిన మెడల్‌ కూడా ఉంది.

ఇవి కూడా చదవండి

బెన్ స్టోక్స్ ట్వీట్..

చివరకు అవి కూడా వదల్లేదుగా..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us